South East Central Railway Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1003 అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం పోస్టుల సంఖ్య: 1003
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో పలు రకాల అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో గ్రాఫర్, మెకానిక్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ తదితర పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్): 185
టర్నర్: 14
ఫిట్టర్: 188 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 199 పోస్టులు
స్టెనోగ్రాఫర్ (హిందీ): 8 పోస్టులు
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 13 పోస్టులు
హెల్త్ అండ్ సానిటరీ ఇన్ స్పెక్టర్: 32 పోస్టులు
సీవోపీఏ: 10 పోస్టులు
మెకానిస్ట్: 12 పోస్టులు
మెకానిక్ డీజిల్: 34 పోస్టులు
మెకానిక్ రిఫ్ అండ్ ఏసీ: 11 పోస్టులు
బ్లాక్ స్మిత్: 2 పోస్టులు
హామ్మెర్ మ్యాన్: 1 పోస్టు
మేజన్: 2 పోస్టులు
పైప్ లైన్ ఫిట్టర్: 2 పోస్టులు
కార్పెంటర్: 6 పోస్టులు
పెయింటర్: 6 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 9 పోస్టులు
వేగాన్ రిపైర్ షాప్, రాయ్ పూర్ లో కూడా వెకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్: 110 పోస్టులు, వెల్డర్: 110 పోస్టులు, మెకానిస్ట్: 15 పోస్టులు, టర్నర్: 14 పోస్టులు, ఎలక్ట్రీషియలన్: 14 పోస్టులు, సీవోపీఏ: 4 పోస్టులు, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 1 పోస్టు, స్టెనోగ్రాఫర్ (హిందీ): 1 పోస్టు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 3
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 2 (ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.)
వయస్సు: కనీస వయస్సు 15 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 24 ఏళ్లు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉండాలి.
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://secr.indianrailways.gov.in/
అప్లికేషన్ లింక్: https://www.apprenticeshipindia.gov.in/
నోటిఫికేషన్ కు సంబందధించి ఎలాంటి సందేహాలున్నా 7024149242 నంబర్ కాల్ చేయవచ్చు. (ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అందుబాటులో ఉంటారు)
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 1003
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 2
ALSO READ: Tenth class students: రేపు పదో తరగతి పరీక్ష ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ..