Nandamuri Family Issues : ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయనకు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్. అలాగే పద్మ భూషణ్ అవార్డు కూడా… ఇలా నందమూరి ఇంట ఎన్ని శుభవార్తలు విన్నా… ఎక్కడో తెలియని అసంతృప్తి.
పెద్దయాన ఎన్టీ రామారావుకు ఎంతో ఇష్టమైన మనవుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటి బయట ఉన్నాడు. అన్న కళ్యాణ్ రామ్‌తో కలిసి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. వీళ్ల పంచాయితీ చాలా సార్లు బహిరంగంగానే జరిగాయి. ముఖ్యంగా బాలయ్య vs జూనియర్ ఇది నందమూరి ఫ్యాన్స్ అసలు మింగుడు పడలేని అంశం.
చాలా సార్లు స్టేజ్‌లపైనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బాలయ్య డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ విభేదిస్తూ… వస్తున్నాడు. అవి కూడా అందిరికీ అర్థమయ్యేలా… అలాగే తారక్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ, టీడీపీ గురించి అసలు పట్టుంచుకోవడం లేదు. నందమూరి ఫ్యామిలీ అని చెబుతున్నా… ఫ్యామిలీ విషయాలను కూడా పట్టించుకోవడం లేదు. టీడీపీ పార్టీ లో కూడా వీరికి స్థానం రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది.
అంతే కాదు… నందమూరి ఇంట జరిగే ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా ఈ ఇద్దరు బ్రదర్స్ కి ఇన్విటేషన్ రావడం లేదు. దీంతో ఎన్ని శుభవార్తలు విన్నా.. నందమూరి ఫ్యాన్స్ కు మాత్రం ఈ విషయం అనేది ఎప్పుడూ తలనొప్పిని తీసుకొచ్చేదే.
అయితే, ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణమాలను చూస్తే… నందమూరి ఫ్యామిలీతో తారక్, కళ్యాణ్ రామ్ కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని అనిపిస్తుంది.
మొన్న లోకేష్…
మొన్న లోకేష్ ఒక రోడ్ షోలో… జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చేతిలో పట్టుకుని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశాడు. ఈ సీన్ చూడటానికి నందమూరి ఫ్యాన్స్ కు రెండు కళ్లు చాలలేదు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అలాగే ఫ్యాన్స్ కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి అంటూ కూడా నెట్టింట్లో కామెంట్స్ చూశాం.
ఇప్పుడు కళ్యాణ్ రామ్…
నందమూరి ఫ్యాన్స్ మరోసారి హ్యపీగా ఫీల్ అయ్యేలా చేశాడు కళ్యాణ్ రామ్. ఆయన మెయిన్ లీడ్ చేస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజాయంతి సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి నరసరావుపేటలో ఓ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి కళ్యాణ్ రామ్ రోడ్ షో లా వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ అభిమానులు టీడీపీ జెండాను ఎగరవేస్తూ కనిపించారు. వారిని అడిగి మరీ… ఆ టీడీపీ జెండాను చేతులోకి తీసుకుని ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు.
ఇది రెండో సారి…
నిజానికి ఇదో రెండు సందర్భం అని చెప్పొచ్చు. మొన్న ఇదే మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతూ… నందమూరి కుటుంబం గురించి, బాలయ్య గురించి మాట్లాడింది. అప్పుడే.. కళ్యాణ్ రామ్ నుంచి బాలా బాబాయ్ అంటూ వచ్చింది.
ఇలా లోకేష్ నుంచి కళ్యాణ్ రామ్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన వీటిన చూస్తే… నందమూరి ఫ్యామిలీకి కళ్యాణ్ రామ్, తారక్ దగ్గరవుతున్నారని, ఫ్యాన్స్ కన్న కలలు నెరవేరుతున్నాయని తెలుస్తుంది.