Tenth class students: ఏపీ రాష్ట్ర టెన్త్ విద్యార్థులకు ఇది అలెర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన టెన్త్ క్లాస్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించాలని విద్యాధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు సర్కార్ రేపు ఆప్షణల్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు జరగాల్సిన టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగుతోందా..? లేదా..? అనే దానిపై విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. దీనిపై విద్యాశాఖ అధికారులు తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆప్షనల్ హాలిడేకు టెన్త్ క్లాస్ పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రేపు ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన ఎగ్జామ్ లో ఎలాంటి మార్పు ఉండదని రేపు జరగబోయే పరీక్ష యథావిధిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుందంని అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఎగ్జామ్ కోసం చదవాలని సూచించారు.
ALSO READ: Group-1 Results: పండుగ పూట గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. జనరల్ ర్యాకింగ్స్ విడుదల