HPCL Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, రిఫైనరీస్ విభాగంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముంబయి, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, రిఫైనరీస్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 21న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్: 11
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్: 17
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్‌స్ట్రుమెంటేషన్: 6
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – కెమికల్: 41
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ & సేఫ్టీ: 28
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సు లేదా సైన్స్ విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: మే 21
వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 25 ఏళ్ల మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.1,20,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://hindustanpetroleum.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.1,20,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.
Also Read: AFMS Recruitment: ఏఎఫ్ఎంఎస్‌లో 400 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103
దరఖాస్తుకు చివరి తేది: మే 21
జీతం: రూ.30వేల నుంచి రూ.1,20,000 వరకు జీతం..