Chowmahalla Palace: హైదరాబాద్‌లో టూరిజం అనగానే చాలా మందికి చార్మినార్, గోల్కొండ, హుసేన్ సాగర్.. ఇవే గుర్తొస్తాయి. కానీ, సిటీలోనే మరో కొత్త టూరిస్ట్ ప్లేస్ ఉందని తెలిసిన వారు అరుదుగా ఉంటారు. వన్ డే ట్రిప్ ప్లాన్ చేసే వారు, రోటీన్ ప్రదేశాలు కాకుండా కాస్త కొత్తదనాన్ని కోరుకునే వారు ఇక్కడికి వెళ్లడం బెస్ట్. ఇంతకీ ఆ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చార్మినార్ పక్కనే ఉన్న చౌమహల్లా ప్యాలెస్ ఒక చారిత్రక అద్భుతం. నీజామ్‌ల రాజసం, అదిరిపోయే నిర్మాణం, సాంస్కృతిక వైభవంతో ఈ ప్యాలెస్ దేశవిదేశాల నుంచి టూరిస్టులను ఆకర్షిస్తోంది. ‘చౌమహల్లా’ అంటే ఉర్దూలో ‘నాలుగు రాజభవనాలు’ అని అర్థం. ఈ పేరు దాని నాలుగు ప్రధాన భాగాలను చూపిస్తుంది.
నిజాంల చరిత్ర
1750లో సలాబత్ జంగ్ హయాంలో మొదలై, 1857-1869 మధ్య అఫ్జల్-ఉద్-దౌలా సమయంలో పూర్తైన ఈ ప్యాలెస్, హైదరాబాద్‌ను 1720-1948 మధ్య పాలించిన అసఫ్ జాహీ నీజామ్‌ల రాజనివాసం. ఇరాన్‌లోని సాదాబాద్ కాంప్లెక్స్ స్ఫూర్తితో ఇండో-సరసెనిక్, పర్షియన్, యూరోపియన్ శైలుల మిక్స్‌తో దీన్ని బిల్డ్ చేశారు. అందమైన స్టక్కో డిజైన్లు, భారీ శాండిలియర్లు, విశాలమైన కోర్ట్‌యార్డ్‌లు ఇక్కడ స్పెషల్. ఖిల్వత్ ముబారక్ అనే గ్రాండ్ దర్బార్ హాల్‌లో బెల్జియన్ క్రిస్టల్ శాండిలియర్లు రాజవంశ వేడుకలకు వేదికగా ఉండేవి.
సాంస్కృతిక హబ్
ఇప్పుడు ఈ ప్యాలెస్ ఒక లివింగ్ మ్యూజియంలా మారింది. నీజామ్‌ల రిచ్ లైఫ్‌స్టైల్‌ను చూపిస్తూ, ఉత్తర-దక్షిణ ఆంగణాల్లో రేర్ రాగిరాతలు, వింటేజ్ కార్లు, రాజ వస్తువులు డిస్‌ప్లేలో ఉన్నాయి. 250 ఏళ్లుగా టిక్‌టిక్‌లాడుతున్న ఖిల్వత్ క్లాక్ ఇక్కడి టైంలెస్‌నెస్‌కు సింబల్. 1948 తర్వాత కొంత నిర్లక్ష్యానికి గురైన ఈ ప్యాలెస్‌ను ప్రిన్సెస్ ఎస్రా జహ్ అద్భుతంగా రిస్టోర్ చేశారు. ఈ ఏడాది మేలో 72వ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్‌ను సాంప్రదాయ షెహనాయ్, నౌబత్ మ్యూజిక్‌తో స్వాగతించి, ఈ ప్యాలెస్ గ్లోబల్ స్పాట్‌లైట్‌లోకి వచ్చింది. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్‌తో కలిపి, హైదరాబాద్ సాంస్కృతిక టూరిజం హాట్‌స్పాట్‌గా మారింది.
ఎందుకు వెళ్లాలి?
చార్మినార్, మక్కా మస్జిద్‌లకు దగ్గర్లో ఉన్న చౌమహల్లా సులభంగా చేరుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓపెన్ (శుక్రవారం క్లోజ్). టికెట్ ధరలు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.40, ఫారినర్స్‌కు రూ.400. లష్ గార్డెన్స్, వింటేజ్ కార్ మ్యూజియం, రాజ చిత్రాలు, వస్త్రాలు, ఆయుధాలు చూడొచ్చు. చరిత్ర లవర్స్, ఆర్కిటెక్చర్ ఫ్యాన్స్, కామన్ టూరిస్టులకు ఇది కిక్కిచ్చే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
హైదరాబాద్ టూరిజం
గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు చౌమహల్లా హైదరాబాద్ హెరిటేజ్ టూరిజంలో కీలకం. లోకల్ ట్రావెల్ ఏజెంట్స్ చెప్పినట్టు, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలతో హైదరాబాద్ హెరిటేజ్ స్పాట్స్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది.
ఎలా వెళ్లాలి?
చౌమహల్లా ఓల్డ్ సిటీలోని మోతీ గల్లీ రోడ్.లో ఉంది. హైదరాబాద్ సెంటర్ నుంచి టాక్సీ, ఆటో, క్యాబ్ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. పార్కింగ్ సౌకర్యం ఉంది, కానీ ఓల్డ్ సిటీ రద్దీ కాబట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బెటర్.