Indian Railwyas: విమాన ప్రయాణంలో ప్యాసెంజర్లకు ఎయిర్ హోస్టెస్ మద్యం అందించడం కామన్ గా చూస్తుంటాం. మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకోవచ్చు. ఇంతే తాగాలి.. అనే రూల్ ఏమీ లేదు. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు తాగవచ్చు. విమానాలు ఓకే.. మరి రైల్లో మద్యం తాగవచ్చా? అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఇంతకీ మద్యం విషయంలో రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారతీయ రైల్వే సంస్థ పలు మద్యం విషయంలో కచ్చితమైన రూల్స్ పాటిస్తున్నది. రైల్లో ధూమపానంతో పాటు మద్యపానం విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. విమానంలో మాదిరిగా రైల్లో మద్యం తాగుతామంటే అస్సలు కుదరదు. తాగడం కాదు, అసలు తీసుకెళ్లడం కూడా నిషేధమే. రైల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ఒకవేళ పొరపాటున మద్యం క్యారీ చేయడం కూడా నేరమే అవుతుంది.
రైల్లో మద్యం తీసుకెళ్లడం నిషేధం
రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్లడం, తాగడం పూర్తిగా నిషేధం. సీలు చేసిన మద్యం బాటిల్స్ ను తీసుకెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి తీసుకెళ్తే, రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం రైల్వే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం, రైల్లో మద్యంతో పట్టుబడిన వాళ్లు రూ. 500 వరకు జరిమానా లేదంటే 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి రైల్లో ఎలాంటి మండే స్వభావం ఉన్న పదార్థాలను తీసుకెళ్లకూడదు. రైల్వే సంస్థ ఆల్కహాల్ ను కూడా మండే పదార్థాల లిస్టులో చేర్చింది. అందుకే, మద్యాన్ని రైల్లో అనుమతించరు. ఒకవేళ మద్యం సేవించి రైల్లో ఏమైనా డ్యామేజ్ చేస్తే ఆ ఖర్చును సదరు వ్యక్తే భరించాల్సి ఉంటుంది.
కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనలు
రైలులో మద్యం తీసుకెళ్లడానికి సంబంధించి రైల్వే అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మద్యపానంపై నిషేధం అమలు అవుతున్నది. మీరు రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ రాష్ట్రాల్లో మద్యంతో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను అనుభవించాల్సి రావచ్చు.
Read Also: వందే భారత్ స్లీపర్ రైలు.. టెస్టింగ్‌లో ఎంత వేగంగా దూసుకెళ్లిందో తెలుసా? ఇదిగో వీడియో!
ప్రత్యేక పరిస్థితుల్లో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి
రైల్లో మద్యం తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సుమారు 1.5 లీటర్ల వరకు మద్యం క్యారీ చేయవచ్చు. అయితే, మద్యం తీసుకెళ్లడానికి సంబంధిత రైల్వే జోన్ అధికారి నుంచి పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ మద్యాన్ని రైల్లో తాగడానికి కాకుండా మరేదైనా ఇతర కారణంతో తీసుకెళ్తున్నట్లు ఆధారాలు చూపించాలి. మీ రిక్వెస్ట్ కు రైల్వే జోన్ అధికారి కన్విన్స్ అయితే, అప్పుడు మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అయితే, 1.5 లీటర్ల మద్యం సీల్ చేసిన బాటిల్ లో ఉండాలి.
Read Also: ఏంటీ.. 1973లో మన రైళ్లు అంత వేగంతో ప్రయాణించేవా? మరి ఇప్పుడు?