BigTV English

Kim Jong-un : పూర్తిగా అలా మారిపోతున్న కిమ్ జోంగ్ ఉన్ – సౌత్ కొరియా నిఘాలో షాకింగ్ విషయాలు

Kim Jong-un : పూర్తిగా అలా మారిపోతున్న కిమ్ జోంగ్ ఉన్ – సౌత్ కొరియా నిఘాలో షాకింగ్ విషయాలు

Kim Jong-un : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆయన ఏం చేసినా ఆశ్చర్యంగా, కొన్ని సార్లు వింతగా అనిపిస్తుంటుంది. తాజాగా.. తన తాత, ఉత్తర కొరియా స్థాపకుడు అయిన కిమ్ II సంగ్… లాగా కనిపించేందుకు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజం అన్నది తెలియకపోయినా.. ఉత్తర కొరియాపై నిరంతరం నిఘాను కొనసాగించే దక్షిణ కొరియా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గతంలోని కిమ్ ముఖానికి ఇటీవల కాలంలోని ముఖంలో చాలా మార్పులు జరిగినట్లుగా తెలుస్తోందంటున్నారు.


దేశాన్ని సుదీర్ఘకాలం, ప్రభావంతంగా పరిపాలించిన తన తాతను గుర్తు చేసేందుకు కిమ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆయనలా కనిపించేందుకు, ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు.. ఆయన లానే హెయిర్ స్టైల్, డ్రస్సింగ్ స్టైల్, నడిచే విధానంతో పాటుగా, ఆయన హావభావాలు, ప్రజల్లోకి వచ్చేటప్పుడు కిమ్ సంగ్ మాదిరి కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ రకమైన ప్రవర్తన సైతం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. కాగా.. ఇప్పుడు ఏకంగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారన్న వార్తలు.. ఆసక్తికరంగా మారాయి. అయితే… ఈ పుకార్లపై ఉత్తర కొరియా స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, అలాంటి వార్తల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే కొంతమంది విశ్లేషకులు.. కిమ్ ముఖ ఆకారం, దవడ రేఖ, బుగ్గలు దగ్గర స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవలి ఫోటోలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఊహలే..  అతను కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నాడనే ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది. అతని కనుబొమ్మలు, ముక్కు,పెదవులు కూడా అతను విద్యార్థిగా ఉన్నప్పటి చిత్రాలతో పోలిస్తే కొద్దిగా మారినట్లు కనిపిస్తున్నాయి.


ఉత్తర కొరియా మీడియా సైతం కిమ్ ఇల్ సంగ్‌ పోలికల్ని కిమ్ జోంగ్ ఉన్ ఫోటోలకు ఆపాదించేందుకు ప్రయత్నిస్తుంటుంది. తరచుగా చిత్రాలను ఎడిట్ చేయడం, లేదా  అతను తన తాతలా కనిపించేలా చేసే కోణాల్లోని ఫోటోలను ఎంచుకుంటుంది. ప్రభుత్వ నియంత్రిత మీడియా కూడా కిమ్ జోంగ్ ఉన్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడనే ఆలోచనను ప్రజల్లో కలిగించేందుకు బలంగా ప్రయత్నిస్తుంటుంది.

కొన్ని దక్షిణ కొరియా నిఘా నివేదికలు కాస్మెటిక్ సర్జరీ అవకాశం గురించి వివరించాయి. అయితే.. ఖచ్చితమైన రుజువు సమర్పించలేదు. మాజీ ఉత్తర కొరియా దౌత్యవేత్త థే యోంగ్-హో, తన తాతతో కిమ్ పోలిక పూర్తిగా సహజమైనది కాకపోవచ్చు అని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ అచ్చంగా ఆయన తాతలాగానే ఉంటారు. శారీరక పోలిక సైతం సరిపోతుంటుంది. కానీ.. ప్లాస్టిక్ సర్జరీ నివేదికలతో ప్యాంగాంగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనూ అనేక విషయాల్లో ఇలాంటి రూమర్లు వచ్చినా పెద్దగా స్పందించని ప్యాంగాంగ్ సహనం నశించినట్లు కనిపిస్తోంది. శత్రువులు విడుదల చేసిన నివేకలు తప్పు అని.. అలాంటి వాటిని నేరపూరిత చర్యగా భావిస్తున్నట్లు తెలిపింది.

ఈ ఊహాగానాల్ని పార్టీ, రాష్ట్రం, సైన్యం, తమ దేశ ప్రజలు ఎప్పటికీ సహించరంటూ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ఓ కథనాన్ని ప్రసారం చేసింది. కిమ్ 20 ఏళ్ల వయసులోనూ ఇలాంటి సర్జరీ చేయించుకున్నారనే ఆలోచన ఊహించలేనిదని.. ఇదంతా చెత్త మీడియా సృష్టి అంటూ కొట్టిపడేసింది. గత వారం దక్షిణ కొరియా వార్తాపత్రికలు విస్తృతంగా ప్రచురించిన ఒక చైనా నివేదిక ప్యాంగాంగ్ కోపానికి కారణంగా తెలుస్తోంది.

Also Read : South Korea : సొంత పౌరుల మీదే బాంబు దాడి – దక్షిణ కొరియా సైన్యం స్పందనేంటి.?

1994లో మరణించిన కిమ్ ఇల్-సంగ్ ఇప్పటికీ చాలా మంది ఉత్తర కొరియన్లకు గుర్తుండేలా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారికి ఆయన్ను గుర్తు చేసేలా కిమ్ నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఆయనను అధికారికంగా “ది గ్రేట్ లీడర్” అని పిలుస్తారు. రాజ్యాంగంలో దేశ “శాశ్వత అధ్యక్షుడు”గా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×