Vijayashanti: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్, ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సినిమా ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కళ్యాణ్ రామ్ బింబిసారా తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. మొదటిరోజు రూ.5.15 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లుగా, చిత్ర బృందం తెలిపింది. అయితే సినిమాపై కొందరు, మిక్స్డ్ టాక్ వచ్చేలాగా రివ్యూ ఇస్తున్న వారికి విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఏమన్నారో చూద్దాం..
విజయశాంతి మాస్ వార్నింగ్ ..
ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేమంతా కోరుకుంటాం. బాగున్నది బాలేదని, బాలేనిది బాగుందని ఏంటి ఇదంతా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరెవరి ఇలాంటి తప్పులు చేస్తున్నారో మీ మైండ్ సెట్ ని మీరు మార్చుకోండి. ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఎంతో హోప్స్ పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తారు. వారిని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదు అంటే చూడొద్దు.. క్వైట్ గా ఉండండి అంతేకానీ, సినిమాని ఖూనీ చేద్దామని ప్రయత్నించే దుష్టశక్తులకు నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలో మీరు వచ్చి డిస్టర్బ్ చేయాలని చూసినా ఊరుకునేది లేదు. ప్రజలు సినిమా బాగుందని చెప్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరైనా ఇలా చెయ్యమని చెప్తుంటే మీరు వారి దగ్గరికి వెళ్ళండి. మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి చెంచాగిరి చేయండి. మా సినిమాని నెగిటివ్ చేయొద్దు. మా సినిమాల జోలి రావద్దు. మేమంటే 46 ఇయర్స్ నుండి సినిమా చేస్తున్నాము కానీ, ఇప్పుడున్న జనరేషన్ హీరో, హీరోయిన్స్ ఎంతో నమ్మకంతో సినిమాని చేస్తారు. అలాంటి వారి కెరియర్ తో మీరు ఆటలాడొద్దు అని విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన వారంతా విజయశాంతి రివ్యూలు నెగిటివ్ గా రాస్తున్న వారి గురించి సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకొస్తున్న వారికి మంచి గుణపాఠం చెప్పారని అంటున్నారు.
విజయశాంతి మొదటిగా స్పందించారు..
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఇలాంటి వార్నింగులు ఇవ్వడం మనం గతంలోనూ చూడొచ్చు. ఆమె తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవ, తన కొడుకు ప్రమాదం నుండి బయటపడినందుకు తిరుమలకు వెళ్లారు. అక్కడ ఆమె దేవుడికి తలనీలాలు అర్పించారు. ఆమె తిరుమల గుడిలో అన్నదానం ట్రస్టుకు విరాళం కూడా అందించారు. ఆ తర్వాత ఆమె గురించి హేయమైన కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయంపై విజయశాంతి మొదటిగా స్పందించారు. సోషల్ మీడియా దాడిపై లేడీ సూపర్ స్టార్ పోస్ట్ చేశారు. ఆమె చేసిన దానికి మనం అభినందించాలి కానీ ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ విజయశాంతి గారు స్పందించడం మనం చూసాం. లేడీ సూపర్ స్టార్ ఇలా అన్యాయం అని అనిపిస్తే దానిపై మొదటిగా స్పందించడం అనేది ఆమెలో స్పెషల్ క్వాలిటీ.
Jr NTR : హమ్మయ్య మొత్తానికి తిరిగొచ్చాడు… ఇక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్సే