Bowling Action: క్రికెట్.. మన ఇండియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడ. క్రికెట్ ఆడడానికి అలాగే చూడడానికి ఇండియన్స్ చాలా ఆసక్తి చూపిస్తారు. దీంతో ఇండియాలో క్రికెట్ బాగా వ్యాప్తి చెందింది. జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ క్రికెట్ మాత్రమే అందరూ చూస్తూ ఉంటారు. అంతలా ఫేమస్ అయిపోయింది క్రికెట్. అయితే ఇలాంటి క్రికెట్లో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు ఫన్నీగా ఉంటే మరికొన్ని సీరియస్ గా కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఓ బౌలర్ వేస్తున్న బౌలింగ్ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Hasan Ali on Abrar : PSLలో మరో అరాచకం.. వికెట్ తీసి హసన్ అలీ ఏం చేసాడో చూడండి
ఇదెక్కడి బౌలింగ్ రా నాయన ?
ఇండియాలో ప్రతి గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యూత్ గా ఏర్పడి… క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. వీడియోలో చూపించినట్లుగా… ఫాస్ట్ బౌలింగ్ కాకుండా సర్కిల్స్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఓ కుర్రాడు వచ్చి బౌలింగ్ వేశాడు. ఇంతవరకు క్రికెట్ చరిత్రలో ఎవరు వేయని విధంగా బౌలింగ్ చేశాడు ఆ కుర్రాడు. మెలికలు తిప్పుతూ… బంతిని రెండు చేతులా ఆడిస్తూ… బ్యాటర్ ను కన్ఫ్యూజ్ చేశాడు. లసిత్ మలింగ, బుమ్రా లాంటి బౌలర్లు.. బౌలింగ్ వేస్తేనే బ్యాటర్లు కన్ఫ్యూజ్ అవుతారు.
కానీ వాళ్ళ కంటే తోపు బౌలింగ్ వేస్తున్నాడు ఈ కుర్రాడు. ఎడమ చేతిలో పట్టుకొని… తన బాడీని అటు ఇటు తిప్పుతూ… లెఫ్ట్ హ్యాండర్ లాగా బౌలింగ్ వేస్తూనే… బంతిని కుడి చేతితో వదులుతున్నాడు. అతడు వేసేది స్కిన్ అయినప్పటికీ… బ్యాటర్ కన్ఫ్యూజ్ అయి వికెట్ కోల్పోతున్నాడు. వీడియోలో చూపించినట్లు…. ఈ కుర్రాడు బౌలింగ్కు… సదరు బ్యాటర్ కన్ఫ్యూజ్ అయి వికెట్ కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకురండి
అయితే వింతగా బౌలింగ్ చేస్తున్న ఈ కుర్రాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి.. ఆ కుర్రాన్ని తీసుకురండి రా అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వెంటనే కావ్య పాపకు ఈ వీడియోను పంపి వచ్చే సీజన్లో ఆయన…. బరిలోకి దింపాలని కోరుతున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 19, 2025