Local Bank Officer Jobs: నిరుద్యోగులకు సువర్ణవకాశం. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. ఈ నెల 28న దరఖాస్తు గడువు ముగియనుంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 110 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 110
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 7
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 28
వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో రాయితీ ఉంటుంది. వారు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, స్ర్కీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫైనల్ మెరిట్ లిస్ట్, లోకల్ లాంగ్వేజ్ పైన అవగాహన ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
రాత పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవెర్నేస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు, జనరల్ అవెర్నేస్ నుంచి 30 ప్రశ్నలు, ఎకానమీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 120 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ.48,480 ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://punjabandsindbank.co.in/
Also Read: RRB Group-D Job: జస్ట్ ఇవి చదవండి.. గ్రూప్-D ఉద్యోగం మీ సొంతం.. అసలు MISS అవ్వొద్దు..
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థలకు మంచి వేతనం కూడా లభించనుంది. ఉద్యోగంలో చేరిన మొదట నెలే రూ.48,480 జీతం పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.