BigTV English

Telangana Gurukulam: గురుకులాలకు గుడ్ న్యూస్.. బకాయిల చెల్లింపుపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Telangana Gurukulam: గురుకులాలకు గుడ్ న్యూస్.. బకాయిల చెల్లింపుపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Telangana Gurukulam: అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాల అద్దె బకాయిల చెల్లింపుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇటీవల అద్దె భవనాలకు అద్దె చెల్లించడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.


భట్టి మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్ల, గురుకులాల అద్దె బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు. సంబంధిత ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఫ్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మరమ్మతులు చేపట్టాలి, కిటికీలు, ప్రధాన ద్వారాలు కూడా దోమతెరలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లు తెలిపారు.

బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షల పైన దృష్టి సారించాలని ఆదేశించారు. గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశం పెట్టడం మూలంగా ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ కోర్స్ తో పాటు ఒక కోర్స్ ఒకేషనల్ కోర్సులకు కేటాయించాలని.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అలాగే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు.


రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై సమీక్ష..
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ఫ్రీ బడ్జెట్ సంవత్సరం పలు అంశాలు చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు డి పి ఆర్, 3d డిజైన్లు వంటి పనులు వేగవంతం చేయండి, నిధుల కొరత లేదని వారు తెలిపారు. ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించండి, పెద్ద సంఖ్యలో ఉన్న విలువైన ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు అన్ని స్థాయిల్లో చర్యలు చేపట్టాలని ఇరువురు మంత్రులు ఆదేశించారు. హైబ్రిడ్ యాన్యూటీ హెడ్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. వివిధ పనులపై ప్రతిరోజు వేలాదిమంది జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు వివిధ పనుల కోసం వస్తుంటారని వివరించారు.

Also Read: Petrol Offers in Hyd: హైదరాబాదీలకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే పెట్రోల్, ఈ తేదీ లోపే ట్యాంకులు నింపేసుకోండి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చాం, గత పది సంవత్సరాలు పాలించిన వారు ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తిరిగి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చట్టం నిధుల మేరకు స్థానికంగా పనులు చేపడుతున్న విషయాన్ని ఆ ప్రాంత నేతలు, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆర్ అండ్ బి శాఖ అధికారులపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్ & బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్,డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్,సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రెటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.

Related News

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Big Stories

×