Sucharindia Foundation : ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 32వ సర్.సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది.. రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 32 వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 20 మందికి గోల్డ్ మెడల్స్, 40 మంది ర్యాంకర్స్ కి, అలాగే 400 డిస్ట్రిక్ ర్యాంకర్స్ కి, 20 మందికి గురుబ్రహ్మ మరియు ఛత్రలయా పురస్కార్ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు పబ్లిక్ గార్డెన్స్, లలితా కళా తోరణం లో ప్రదానం చేయనున్నారని సుచిరిండియా ఫౌండేషన్ లయన్ కిరణ్ తెలిపారు.
ఈ సేవా సంస్థ ప్రతి ఏడాది ఇలా విద్యార్థుల టాలెంట్ ను గుర్తించి వారికి అవార్డులను అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, అవార్డులు మరియు రివార్డులతో వారిని ప్రోత్సహించడంలో ముందంజలో ఉంది. ఈ లక్ష్యం కోసం, ఫౌండేషన్ దాదాపు 32 సంవత్సరాల క్రితం సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులను ప్రారంభించింది. సుచిరిండియా ఫౌండేషన్ జాతీయ స్థాయిలో ప్రతిభ పరీక్షను నిర్వహించి, ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన మరియు విజేతలైన విజేతలను సత్కరిస్తుంది. సమాజం లోని వాళ్లంతా ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండేలా తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా వారసత్వాన్ని కొనసాగించడమే మన గొప్ప లక్ష్యంగా ఈ సంస్థ ప్రతిభావంతులకు అవార్డులను అందిస్తున్నారు.
అయితే గత ఏడాది ఏప్రిల్ లో ఈ అవార్డులను అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే అవార్డులను అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న పబ్లిక్ గార్డెన్స్, లలితా కళా తోరణం లో సర్.సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం చెయ్యనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా డా. లయన్ కిరణ్, సూచిరిండియా అధినేత, (కాన్సల్ జనరల్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్) , సినీనటుడు రావు రమేష్ లతో పాటుగా తదితరులు పాల్గొననున్నారు..