BigTV English

DSSSB Jobs: ఇంటర్ అర్హతతో 1180 జాబ్స్.. ఈ జాబ్ వస్తే భారీ సంపాదన.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

DSSSB Jobs: ఇంటర్ అర్హతతో 1180 జాబ్స్.. ఈ జాబ్ వస్తే భారీ సంపాదన.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

DSSSB Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త… ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షణ్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న వారికి ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. బీఎడ్, డిప్లొమా, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకనే ప్రయత్నం చేద్దాం.


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో 1180 అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 16న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1180


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు

డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్: 1055 పోస్టులు

న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్: 125 పోస్టులు

దరఖాస్తు ఫీజు: అర్హత ఉన్న వారు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 17

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 16

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీఈడ్ పాసై ఉంటే సరిపోతుంది. టెన్త్ లో హిందీ సబ్జెక్ట్ కచ్చితంగా ఉండాలి.

జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/

అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అప్లై చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1180

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 16

ALSO READ: UPSC Jobs: యూపీఎస్సీలో 213 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే

Related News

UPSC Jobs: యూపీఎస్సీలో 213 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే

TGPSC Group-1: గ్రూప్-1 వివాదం.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన TGPSC

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

IBPS RRB: డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, ఇంకా 4 రోజులే

Indian Railway Jobs: రైల్వేలో భారీగా పారా మెడికల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్

IOCL Jobs: పదో తరగతి అర్హతతో భారీగా జాబ్స్.. మంచి వేతనం.. 2 రోజులే గడువు

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

Big Stories

×