Bigg Boss 9: సాధారణంగా రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో ఎమోషన్స్ , ఫన్, ఫైట్, లవ్ ఇలా మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దొరుకుతుంది. అందుకే ఈ షో కి ఎప్పటికప్పుడు మంచి టిఆర్పి రేటింగ్ కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్ని సీజన్లో లాగే ఈ సీజన్ లో కూడా కొత్తజంట అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో సెలబ్రిటీగా అడుగుపెట్టిన రీతు చౌదరి కామనర్ ఆర్మీ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు బిగ్ బాస్ నిర్వహకులు మనకు చూపిస్తున్నారు.
కెప్టెన్సీ టాస్క్ లో లవ్లీ జంట మధ్య గొడవ..
అయితే ఇప్పుడు తాజాగా వదిలిన ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ ఈ లవ్లీ జంట మధ్య గొడవ పెట్టిందే అనేటట్టు ప్రోమో ద్వారా చూపించడం గమనార్హం. తాజాగా మొదటి వారంలో భాగంగా సంజన హౌస్ కి మొదటి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా.. ఇక రెండవ వారానికి సంబంధించి రెండవ కెప్టెన్సీ బాధ్యతను ఎవరు తీసుకోబోతున్నారు అనే విషయంపై కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఇకపోతే 11వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేయగా.. ఈ కెప్టెన్సీ టాస్క్ పోరు అధ్యంతం ఉత్కంఠ గా మారింది అని చెప్పవచ్చు.
ఆకట్టుకుంటున్న ప్రోమో..
ప్రోమో విషయానికి వస్తే మర్యాద మనీష్ బిగ్ బాస్ పంపిన టాస్క్ గురించి వివరిస్తూ.. “టెనెంట్స్ ఇప్పుడు ఓనర్ గ్రూపు నుండి కెప్టెన్సీ టాస్క్ కోసం అర్హత లేదని మీరు భావించిన నలుగురిని నిర్ణయించి, వారి పేర్లను బిగ్ బాస్ కి తెలియజేయండి” అంటూ టాస్క్ గురించి వివరించారు. దీంతో అందరూ చర్చించుకుని సంజన మాట్లాడుతూ.. “మా అందరికీ ఇది కఠినమైన టాస్క్. మేమంతా ప్రియాను వద్దనుకున్నాము” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. దాంతో ప్రియా మాట్లాడుతూ..” తను హ్యాండిల్ చేయలేకపోయారా? లేక మీరందరూ హ్యాండిల్ చేయలేకపోయారా?” అంటూ సూటిగా ప్రశ్నించింది. ఇక దాంతో సంజన మాట్లాడుతూ..” తన మూడు స్వింగ్స్ ను ఎవరు ప్రిడక్ట్ చేయలేకపోయారు” అంటూ సంజన చెప్పడంతో హరీష్ మాట్లాడుతూ ..”మూడు స్వింగ్స్ గురించి ఈవిడే చెప్పాలి మరి” అంటూ ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
కళ్యాణ్ వర్సెస్ రీతూ చౌదరి..
కళ్యాణ్ మాట్లాడుతూ.. “కెప్టెన్ అంటే నామినేషన్ లో ఉన్నవాడు కాదు.. వాడు హ్యాండిల్ చెయ్యగలడా లేదా అని మాత్రమే చూడాలి” అని చెబుతుండగానే మధ్యలో రీతూ చౌదరి కలుగజేసుకొని..”నువ్వు కెప్టెన్ గా ఉంటే అథారిటీ చూపించి మిగతావారి మాటలు వినవు” అంటూ రీతూ చౌదరి కామెంట్లు చేసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైనట్లు చూపించారు. ఏది ఏమైనా ఈ కెప్టెన్సీ టాస్క్ లవ్లీ జంట మద్యం గొడవ పెట్టేసిందని చెప్పవచ్చు.
also read:Deepika Padukone: కల్కి2 నుంచి దీపికా అవుట్.. సందీప్ రెడ్డి రియాక్షన్ చూసారా?