White Hair Tips: తెల్లజుట్టుతో ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇంటి నివారణలు సులువుగా గ్రే హెయిర్‌ను నల్లగా మార్చేస్తుంది. ఈ హోమ్ రెమిడీస్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంది తెల్లజుట్టు తొలగించేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్, బయట దొరికే హెన్నా కలర్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయి కానీ.. పర్నినెంట్‌గా అయితే ఉండవు. పైగా వీటివల్ల జుట్టు పాడైపోవడంతో పాటు.. చర్మ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నాచురల్ బ్లాక్ డై హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. అంతే కాదు జుట్టు పొడవుగా పెరిగేందుకు ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు ఒక సారి ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
మెంతులు
తెల్ల నువ్వులు
కరివేపాకు
కొబ్పరి నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని.. అందులో మెంతులు, నువ్వులు, కరివేపాకు వేసి నల్లగా మాడిపోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో తీసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ ఆయిల్ జుట్టు కుదుళ్లకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేసుకోవచ్చు.. లేదా రాత్రి అప్లై చేసి మరుసటి రోజు తలస్నానం చేయొచ్చు. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో వాడే పదార్ధాలు జుట్టు పెరుగుదలకు, కావాల్సిన పోషకాలు అందించడంతో పాటు.. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
Also Read: ఖరీదైన హెయిర్ ఆయిల్స్ అవసరం లేదు, ఇలా చేస్తే పొడవాటి జుట్టు ఖాయం
తెల్లజుట్టు నివారణకు మెంతులతో మరొక చిట్కా
మెంతులు
కాఫీపొడి
అల్లం
విటమిన్ ఇ క్యాప్సూల్స్
తయారుచేసుకునే విధానం..
నానబెట్టుకున్న మెంతులను మిక్సీజార్‌లోకి తీసుకుని అందులో టీ స్పూన్ కాఫీ పొడి, చిన్న అల్లం ముక్క, కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి 10 నిమిషాల గ్యాస్‌పై మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చిన్న గిన్నెలో వడకట్టుకొని.. అందులో విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి మిక్స్ చేయండి. ఈ ఆయిల్ జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకున్నారంటే.. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోవడంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.