MIL Recruitment: భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చందా యూనిట్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మహారాష్ట్ర, భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చందా యూనిట్, కాంట్రాక్ట్ విధానంలో 135 బిల్డింగ్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ALSO READ: TGSRTC Jobs: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. ఆర్టీసీలో 800 ఉద్యోగాలు, టెన్త్ పాసైతే చాలు
పోస్టులు – ఖాళీలు:
బిల్డింగ్ వర్కర్ పోస్టులు: 135
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 2025 జులై 12 వరకు ఉద్యోగానికి దరఖాస్తు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 12
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్ టెస్ట్, ఎన్‌సీవీటీలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. స్టార్టింగ్ వేతనం రూ.20 వేల వరకు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
చిరునామా: ది చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ చందా, చంద్రాపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర – 442501 అడ్రస్‌కు పంపాల్సి ఉంటోంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: http://www.niperhyd.ac.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. స్టార్టింగ్ వేతనం రూ.20 వేల వరకు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: MECL Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, అప్లై చేస్తే జాబ్.. జీతం రూ.55,900
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 135
దరఖాస్తుకు చివరి తేది: జులై 12