OTT Movie : ఒక చిన్న పట్టణంలో, మాగీ మూర్ అనే ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళలు వరుసగా హత్యకు గురవుతారు. ఈ కేసును స్థానిక పోలీస్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలో అనేక ట్విస్టులు ఎదురుపడతాయి. పోలీస్ చీఫ్ ఒక లవ్ ట్రాక్ ను కూడా నడుపుతాడు. ఇంతకీ ఆ మహిళలను హత్య చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 2000లో హ్యూస్టన్‌లో జరిగిన మేరీ లౌ మోరిస్, మేరీ మెక్‌గిన్నిస్ మోరిస్ హత్యల నుండి స్ఫూర్తి పొందింది. కథ న్యూ మెక్సికోలోని బక్‌లాండ్ కౌంటీ అనే ఎడారి పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ పోలీస్ చీఫ్ జోర్డాన్ సాండర్స్, మాగీ మూర్ అనే ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళల హత్య కేసును దర్యాప్తు చేస్తాడు. సినిమా ఒక మాగీ మూర్ హత్యతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక మోటెల్ పార్కింగ్ లాట్‌లో కాల్చి చంపబడి కనిపిస్తుంది. తర్వాత, రెండవ మాగీ మూర్ కారులో సజీవంగా కాల్చబడినట్లు చూపిస్తారు.
ఈ హత్యల వెనుక మొదటి మాగీ భర్త జే మూర్ , ఒక సాండ్‌విచ్ షాప్ మేనేజర్ ఉంటాడు. జే తన దుకాణంలో గడువు ముగిసిన ఉత్పత్తులను, టామీ టి అనే షాడీ వ్యక్తి నుండి చౌకగా కొనుగోలు చేస్తూ ఒక స్కామ్ నడుపుతాడు. టామీ జేకు చైల్డ్ పోర్నోగ్రఫీని సరఫరా చేస్తాడు. దానిని జే తన డీల్‌లో భాగంగా ఉపయోగిస్తాడు. ఈ రహస్యాన్ని మాగీ కనిపెడుతుంది. ఆమె జేను ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. అతని గురించి పోలీసులకు చెప్పడానికి సిద్ధపడుతుంది. దీనిని అడ్డుకోవడానికి కోస్కో అనే హిట్‌మ్యాన్‌ను నియమిస్తాడు జే. మొదట ఆమెను భయపెట్టమని చెప్తాడు. కానీ కోస్కో ఆమెను హత్య చేస్తాడు.
ఈ కేసులో అతని మీద అనుమానాలను తప్పించడానికి, జే ఒక స్థానిక డ్రగ్ స్టోర్ క్యాషియర్ సమ్మి నుండి మరొక మాగీ మూర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. అతను కోస్కోను మళ్లీ పిలిపించి , రెండవ మాగీని హత్య చేయమని చెప్పి, ఈ హత్యలను ఒక సీరియల్ కిల్లర్ చేసినట్లు క్రియేట్ చేస్తాడు. జోర్డాన్ ఈ హత్యలను దర్యాప్తు చేస్తాడు. జోర్డాన్, తన భార్య మరణం తర్వాత ఒంటరితనంతో పోరాడుతూ, మాగీ పొరుగున ఉండే రీటా గ్రేస్ తో ఒక సంబంధాన్ని పెంచుకుంటాడు. ఈ కేసులో రీటా కూడా జోర్డాన్ కి సాయం చేస్తుంది. చివరికి జే బండారం బయటపడుతుందా ? జోర్డాన్ ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చే విషయాలు ఏమిటి ? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇక్కడ ప్రతీ రాత్రి ఓ యుద్ధమే… పొరపాటున పడుకున్నారో దబిడి దిబిడే
ఈ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘మాగీ మూర్స్’ (Maggie Moores). 2023 లో వచ్చిన ఈ సినిమాకి జాన్ స్లాటరీ దర్శకత్వం వహించారు. ఇందులో జాన్ హామ్ (జోర్డాన్ సాండర్స్), టీనా ఫే (రీటా గ్రేస్), మైకా స్టాక్ (జే మూర్), నిక్ మొహమ్మద్ (డిప్యూటీ రెడ్డీ), హ్యాపీ ఆండర్సన్ (కోస్కో), మేరీ హాలండ్ (మాగీ లీ మూర్), లౌసా క్రాస్ (మాగీ మూర్) వంటి నటులు నటించారు. 1 గంట 39 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.2/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.