BIG TV LIVE Originals: ఇండియాతో పాటు పలు దేశాల్లో సుదూర రాత్రి ప్రయాణం కోసం ఎక్కువగా స్లీపర్ బస్సులను ఎంచుకుంటారు. హాయి నిద్రపోతూ జర్నీ చేయవచ్చని ప్రయాణీకులు భావిస్తారు. అయితే, స్లీపర్ బస్సులలో ప్రయాణం భద్రత పరంగా, ఆరోగ్యం పరంగా అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు. ఇంతకీ స్లీపర్ జర్నీతో కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్లీపర్ బస్సులో భద్రతపై ఆందోళనలు
స్లీపర్ బస్సులలో సీట్లకు బదులుగా వాలు పడకలు అమర్చబడి ఉంటాయి. సాధారణ పరిస్థితులలో ప్రయాణానికి సురక్షితంగా ఉంటాయి. కానీ, చాలా సందర్భాల్లో భద్రతా సమస్యలు తలెత్తుతాయి.
యాక్సిడెంట్ రిస్క్ లు: ఒకవేళ స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురైతే బస్సులో ఉండే లాంగిట్యూడినల్ బెర్త్ డిజైన్, తలపై బలంగా తగిలి పెద్ద గాయాలకు కారణం అవుతుంది. వెన్నెముక సంబంధ గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. సీట్ బెల్ట్ లాంటివి లేకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు ఏర్పడి చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలో ఉన్నవాళ్లు, త్వరగా బయటపడే అవకాశం ఉండదు.
అత్యవసర తరలింపు: ఒకవేళ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైతే ఇరుకైన లే అవుట్, తగినన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేకపోవడం వల్ల ప్రయాణీకుల తరలింపు ఇబ్బందికరంగా ఉంటుంది. కిటికీలను పగలగొట్టి ప్రయాణీకులను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది.
డ్రైవర్ అలసట: రాత్రిపూట జర్నీ కారణంగా డ్రైవర్ అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ లైటింగ్, వంకర రోడ్లు ప్రమాద అవకాశాలను పెంచుతాయి.
ప్రయాణీకులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు
స్లీపర్ బస్సులలో ప్రయాణించడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మూసివేయబడిన విండోస్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయి.
మోషన్ సిక్ నెస్: బస్సు వంకర రోడ్లపై, పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో వికారం, తలతిరగడంతో పాటు తలనొప్పికి కారణం అవుతుంది. టాయిలెట్లు లేనప్పుడు, స్టాప్‌లు తక్కువగా ఉన్న సమయంలో మోషన్ సిక్ నెస్‌కు గురయ్యే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
నిద్ర సరిగా లేకపోవడం: ఎగుడుదిగుడుగా ఉండే ప్రయాణం, ఇతర వాహనాలు, ప్రయాణీకుల నుంచి వచ్చే శబ్దాల కారణంగా నిద్రకు అంతరాయం కలుగుతుంది. పొడవైన ప్రయాణీకులు ఇరుకైన బెర్త్ ల మీద పడుకుని ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.
వెన్ను, మెడ నొప్పి: ఫిక్స్ డ్ బెర్త్ డిజైన్ కారణంగా వెన్నెముక, మెడపై ఒత్తిడి కలుగుతుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణంలో ఈ సమస్యలు తలెత్తుతాయి.
డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు: స్లీపర్ బస్సులలో ప్రయాణం చేసే సమయంలో టాయిలెట్స్ కు ఇబ్బంది ఉండటం వల్లన తక్కువగా నీళ్లు తాగుతారు. ఈ కారణంగా డీ హైడ్రేషన్ కలిగే అవకాశం ఉంటుంది. బస్సులో ఎక్కువగా తినడం లేదంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్లకు అజీర్ణం, కడుపు నొప్పికి కారణం అవుతుంది.
రక్త ప్రసరణ సమస్యలు: ఎక్కువ గంటల పాటు కదలికలు లేకపోవడం వల్ల రక్తం గడ్డకట్టడంతో పాటు కాళ్ళ వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
శ్వాసకోశ సమస్యలు: తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ఉండటం, పేలవమైన వెంటిలేషన్ కారణంగా ప్రయాణీకులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జలుబు సహా ఇతర ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే?
భద్రతా జాగ్రత్తలు: సేఫ్ గా జర్నీ చేయాలనుకునే ప్రయాణీకులు అనుభవం ట్రావెల్స్ బస్సులను ఎంచుకోవాలి. బస్సులు ఫిట్ గా ఉన్నాయో? లేదో? చెక్ చేయాలి. డ్రైవర్ ఎక్స్ పీరియెన్స్ ను కూడా చెక్ చేయాలి. వీలైనంత వరకు పగటిపూట ప్రయాణం చేయాలి. లేదంటే కార్లు సహా ఇతర ప్రయత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.
హెల్త్ టిప్స్: అవసరమైన ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడానికి నెక్ పిల్లో, ఐ మాస్క్ ను ఉపయోగించండి. చిన్న సిప్ లతో హైడ్రేటెడ్‌గా ఉండండి. మోషన్ సిక్ నెస్ టాబ్లెట్లను తీసుకెళ్లండి. బోర్డింగ్ ముందు ఎక్కువగా తినడం మానుకోవాలి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్స్ ఛార్జింగ్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!