BigTV English

PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

PGCIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిప్లొమా, బీటెక్, ఎంటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


మహారత్న పీఎస్‌యూ, అతిపెద్ద ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీల్లో ఒకటైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో కాంట్రాక్ట్ విధానంలో 1,543 ఫీల్డ్‌ ఇంజినీర్‌, ఫిల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్‌ 17 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోండలి.

అభ్యర్థులను పవర్‌గ్రిడ్‌ కామన్‌ ఎఫ్‌ఈఈ రాత పరీక్ష 2025 ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1543

పోస్టులు – వివరాలు..

ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 532 పోస్టులు
ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్): 198
ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 535
ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్): 193
ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 85

విద్యార్హత: కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 27

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 17

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు ఫీల్డ్‌ ఇంజినీర్‌కు రూ.30,000 నుంచి రూ.1,20,000; ఫీల్డ్‌ సూపర్వైజర్‌కు రూ.23,000- రూ.1,05,000.

వయస్సు: 2025 సెప్టెంబర్ 17  నాటికి అభ్యర్థులకు 29 ఏళ్ల వయస్సు మించరాదు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

రాతపరీక్ష: టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. (ఇంగ్లిష్‌, రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌) ఉంటుంది.

ఫీల్డ్‌ ఇంజినీరింగ్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్స్: ఢిల్లీ, భోపాల్, కోల్ కతా, బెంగళూరు, గౌహతి, ముంబై నగరాల్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ కు రూ.400 ఫీజు ఉంటుంది.  ఫీల్డ్ సూపర్ వైజర్ ఉద్యోగానికి రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.powergrid.in/job-opportunities

అప్లికేషన్ లింక్: https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1543

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17

ALSO READ: Intelligence Bureau: ఐబీలో 455 ఉద్యోగాలు.. నో హెవీ కాంపిటేషన్, అప్లై చేస్తే కొలువు భయ్యా

Related News

SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

OFMK Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్ బ్రో

JOB IN APMSRB: ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. లక్షల్లో వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు

Intelligence Bureau: ఐబీలో 455 ఉద్యోగాలు.. నో హెవీ కాంపిటేషన్, అప్లై చేస్తే కొలువు భయ్యా

LIC Jobs: ఎల్ఐసీలో భారీగా ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు

Big Stories

×