Bank Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. పోస్టుకు సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ కు నెల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు. నోటిఫికేసన్ పూర్తి వివరాలను చూద్దాం.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (Punjab & Sind Bank) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు భర్తీ చేసేందుకు అప్లికేషన్స్ కోరుతుంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 158
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా వెకెన్సీలు
రాష్ట్రాల వారీగా వెకెన్సీలను చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ లో 2 పోస్టులు, అస్సాంలో 6 పోస్టులు, బిహార్ లో 15 పోస్టులు, హర్యానాలో 20 పోస్టులు, మధ్యప్రదేశ్ లో 14 పోస్టులు, మణిపూర్ లో 2 పోస్టులు, మిజోరంలో 2 పోస్టులు, నాగాలాండ్ లో 2 పోస్టులు, ఒడిశాలో 10 పోస్టులు, రాజస్థాన్ లో 10 పోస్టులు, ఉత్తరప్రదేశ్ లో 55 పోస్టులు, వెస్ట్ బెంగాల్ లో 20 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 మార్చి 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 30
వయస్సు: మార్చి 30 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
స్టైఫండ్: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.9,000 స్టైఫండ్ ఇస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://punjabandsindbank.co.in/
అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు నెల చొప్పున స్టైఫండ్ కూడా అందజేస్తారు. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 158
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 30
ALSO READ: JOBS: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.60,000.. మీరు కూడా అర్హులే..!