Robinhood Ticket Price: ఈరోజుల్లో ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే చాలు.. దాని బడ్జెట్‌తో సంబంధం లేకుండా టికెట్ ధరలు పెరిగిపోతాయేమో అని ప్రేక్షకుల్లో డిస్కషన్ మొదలయిపోతుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఈ టికెట్ ప్రైజ్ హైక్ అనేది ఎప్పటినుండో ఉంది. మధ్యలో పలు కారణాల వల్ల ఇకపై టికెట్ ప్రైజ్ హైక్ ఉండదని ప్రభుత్వం ప్రకటించినా కూడా నిర్మాతలు మాత్రం ఎంతో కొంత ఈ ధరలను పెంచడానికే ప్రయత్నిస్తున్నారు. ఇక మార్చి నెలాఖరులో విడుదలకు సిద్ధమయిన ‘రాబిన్‌హుడ్’ సినిమాకు సంబంధించి కూడా టికెట్ ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే ఈ విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.
నిర్మాతల క్లారిటీ
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమానే ‘రాబిన్‌హుడ్’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ టీమ్ అంతా నమ్మకంతో ఉంది. ఈ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం టీమ్ అంతా క్రియేటివ్‌గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ అనేది ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని పోస్ట్‌పోన్ చేసుకున్న ‘రాబిన్‌హుడ్’.. ఫైనల్‌గా మార్చి 28న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇంతలోనే టికెట్ ప్రైజ్ హైక్ విషయంలో క్లారిటీ ఇస్తూ నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
అక్కడ మాత్రమే హైక్
‘రాబిన్‌హుడ్ సినిమాకు థియేటర్లలో టికెట్ ధరలు పెరగనున్నాయని ఎన్నో వార్తలు వస్తున్నాయి. అవన్నీ అబద్దాలు. తగిన ధరల్లోనే ప్రేక్షకులకు ఈ సినిమాతో ఎంటర్‌టైన్మెంట్ అందించాలి అన్నదే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ పెరిగిన టికెట్ ధరలు అప్లై అవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మిగతా ప్రాంతాలు అన్నింటిలో మామూలు ధరలే అందుబాటులో ఉంటాయి. రాబిన్‌హుడ్‌ను మీ దగ్గర ఉన్న థియేటర్లలో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు మేకర్స్. దీంతో టికెట్ ప్రైజ్ హైక్‌పై ప్రేక్షకుల్లో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెరగవని అర్థమయ్యింది.
Also Read: ఇండియాలోని మొదటిసారి అలాంటి సినిమా.. ఫస్ట్ లుక్కే అరాచకం
హిట్ పక్కా
వెంకీ కుడుముల (Venky Kudumula), నితిన్ (Nithiin) కాంబినేషన్‌లో ఇప్పటికే ‘భీష్మ’ అనే సినిమా వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆ చిత్రం.. అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నితిన్ నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక వెంకీ కుడుముల దర్శకుడిగా మరొక సినిమా రాలేదు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరికీ హిట్ చాలా అవసరం. ‘రాబిన్‌హుడ్’ (Robinhood) కూడా ‘భీష్మ’ లాగానే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ అవ్వనుందని ఇప్పటివరకు విడుదలయిన అప్డేట్స్‌తో క్లారిటీ వస్తోంది.
Explosive entertainment at affordable prices.#Robinhood pic.twitter.com/v8W5PZKXGa
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025