Jaya Bachchan invited Rekha for lunch: బాలీవుడ్ బిగ్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రేఖల (Rekha) వ్యవహారం ఒకప్పుడు చాలా వార్తల్లో నిలిచింది. ఈ ఇద్దరి ప్రేమాయాణం గురించి బాలీవుడ్‌లో కథలు కథలుగా చెబుతారు. ఇప్పటికీ ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు వస్తే హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. సినిమా సెట్స్‌లో తరచూ కలుసుకోవడం ద్వారా స్నేహంగా ప్రారంభమైన వారి బంధం క్రమంగా లోతైన సంబంధంగా పరిణమించినట్లుగా చెబుతునే ఉంటారు. అయినప్పటికీ, అమితాబ్ మరియు రేఖ ఈ వ్యవహారం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. దీనివల్ల వీళ్ల ప్రేమ బంధం పూ ఎన్నో పుకార్లు షికారు చేశాయి. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో వీరి సంబంధం గురించి మాట్లాడుతు.. ప్రముఖ రచయిత హనీఫ్ జవేరి (hanif javeri), అమితాబ్ భార్య జవేరి జయ బచ్చన్ (Jaya Bachchan) లంచ్ ప్లాన్, రేఖ మరియు అమితాబ్ బచ్చన్ మధ్య సంబంధాన్ని ఎలా శాశ్వతంగా ముగించారనే విషయాన్ని చెప్పుకొచ్చారు.
Also read: షాకింగ్.. నీల్ మావా ఫుల్ బాటిల్ లేపేయ్, కానీ ఎన్టీఆర్‌తో మాత్రం..?
ప్రేమలో ఉన్నది 100 శాతం నిజం
‘దో అంజానే’ సినిమా సెట్స్‌లో రేఖ మరియు అమితాబ్ బచ్చన్ మధ్య సంబంధం మరింత లోతుగా పెరిగిందని రచయిత హనీఫ్ జవేరి మేరీ సహేలీ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘వారు ఎలా ప్రేమలో పడ్డారో నాకు తెలియదు. కానీ వారు ప్రేమలో ఉన్నారని వంద శాతం కరెక్ట్ అని చెప్పవచ్చు. 1982లో కూలీ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినప్పుడు అమితాబ్ జీవితం గణనీయమైన మలుపు తిరిగింది. జయ బచ్చన్ ఎక్కువ సమయం ఆసుపత్రిలో డాక్టర్ల వద్దే ఉండేది. ఆసుపత్రిలో అతని పక్కనే ఉండి, అతనిని జాగ్రత్తగా చూసుకుంది. ఇక్కడి నుంచి.. జయ అంకితభావాన్ని చూసి తన భార్య వైపు మొగ్గు చూపి తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు’ అని హనీఫ్ అన్నారు
Also Read: అజ్ఞాతవాసి వల్ల చాలా డబ్బులు వచ్చాయి… డిజాస్టర్ మూవీ లెక్క చెప్పిన నిర్మాత
అమితాబ్ నా వాడు
ఇదే సమయంలో అమితాబ్ బచ్చన్‌ను తిరిగి పొందడానికి, రేఖ కోసం తన ఇంట్లో విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేసిందని హనీఫ్ జవేరి వెల్లడించారు ‘జయ బచ్చన్ భోజనం కోసం రేఖని తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెకి చాలా మంచి భోజనం తినిపించారు, ఇద్దరూ చాలా మాట్లాడుకున్నారు. అయితే.. వెళ్ళే సమయానికి, జయ రేఖ వైపు చూస్తూ ‘అమితాబ్ నావాడు. అతను ఎప్పుడూ నావాడు’ అని చెప్పింది. ఇదే రేఖను అమితాబ్ పై ఉన్న ప్రేమను వెనక్కి తగ్గేలా చేసిందని అన్నారు. అలాగే.. రాజ్యసభలో వారు కలిసి ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. అక్కడ జయ అమితాబ్ రేఖకు దగ్గరగా కూర్చోకుండా చూసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. అమితాబ్ బచ్చన్, జయబచ్చన్‌లగా కొడుక అభిషేక్ బచ్చన్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటి అమితాబ్ సినిమాల్లో నటిస్తునే ఉన్నారు. ఎనిమిది పదుల వయసులోను ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో అశ్వద్ధామగా అదరగొట్టారు. రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమాలోను నటించారు. అటు హిందీలోను కీలక పాత్రలో నటిస్తున్నారు.