Healthy Habits: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీళ్లు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మన రోజువారీ రొటీన్‌లో ముఖ్యమైన అంశం ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం కూడా మనిషి ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. వేకువజామున్న త్వరగా నిద్ర లేవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఉదయాన్నే త్వరగా లేస్తే, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కువ సమయం విరామం లేకుండా పని చేసినప్పుడు శరీరం అలసిపోతుంది. కానీ, ఉదయం పూట త్వరగా నిద్రలేవడం వల్ల ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉందని అంటున్నారు.
ఉదయాన్నే త్వరగా లేవడం, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అలవాటు చేసుకుంటే, ఎలాంటి ఒత్తిడి లేకుండా శారీరక, మానసికంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.
ఉదయాన్నే లేచి, మంచినిద్రతో బలమైన శక్తిని పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ శక్తితో రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండగలుగుతామని అంటున్నారు.
ఉదయాన్నే లేవడం వల్ల మన శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుందట. ఇది శరీరంలో మంచి ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది. అలాగే, ప్రోటీన్ల ఉత్పత్తి కూడా మెరుగవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గించేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుందట.
ఉదయాన్నే లేవడం వల్ల చాలా సమయం ఉంటుంది. ఉదయం టైమ్ మేనేజ్‌మెంట్ మెరుగుపడటంతో మనం పనిచేసే సమయాన్ని సరిగ్గా కేటాయించవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ALSO READ: మెంతికూరతో ఎంతో మేలు
ఉదయాన్నే త్వరగా లేచే వారు సకాలంలో నిద్రపోతారు. ఇది మొత్తం శరీరానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి సరిపడా నిద్ర ఉన్నప్పుడే హార్మోనల్ ఇంబాలన్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బద్దకం తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవగడియారం కూడా సక్రమంగా ఉంటుందట. ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యోగ, వ్యాయామం వంటివి చేసుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. దీంతో చురుకుగా పని చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మనిషి క్రమశిక్షణతో ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుందట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.