మనస్సు కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలా మంది టీ, కాఫీ తాగుతారు. అయితే, రెగ్యులర్ టీ, కాఫీ తాగి బోర్ గా ఫీలవుతారు. అలాంటి వారికి క్రేజీ కాఫీ అందుబాటులోకి వచ్చింది. అదే కొరియన్ బనానా కాఫీ. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నిజానికి గత కొంత కాలంగా కొరియా బనానా కాఫీ బాగా ఫేమస్ అయ్యింది. ఎంతో మంది కాఫీ లవర్స్ దీనిని తెగ ఇష్టపడుతున్నారు. అరటి, కాఫీని కలిపి తయారు చేసే ఈ కాఫీ తాగితే ఎవ్వరైనా ఆహా అనాల్సిందే. ఈ కాఫీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని హ్యాపీగా తాగవచ్చు. దీన్ని తయారు చేసేందుకు జస్ట్.. అరటిపండ్లు, పాలు, సిరప్, ఐస్ ముక్కలు, కోల్డ్ బ్రూ కాఫీ ఉంటే సరిపోతుంది.
కొరియన్ బనానా కాఫీ తయారు చేయాలంటే, ముందుగా కూల్ కాఫీని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ తీసుకుని దానిలో అరటిపండు, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తే రెండూ చక్కగా కలిసిపోతాయి. దీనికి సిరప్, ఐస్ ముక్కలు యాడ్ చేయాలి. అన్నింటిని కలిపి మళ్లీ మిక్స్ చేయాలి. చక్కగా నురగతో కూడిన చక్కటి కాఫీ రెడీ అవతోంది. జస్ట్ 10 నిమిషాల్లో కొరియా బనానా కాఫీ రెడీ అవుతుంది.
ఇలా రెడీ అయిన కాఫీని ఓ గ్లాస్ జగ్ లోకి తీసుకోవాలి. దానిని పెద్ద కప్పుల్లో పోసుకుని తీసుకోవాలి. అవసరం అయితే, దీనికి కాస్త చాక్లెట్ పౌడర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. నురగ మీద ఈ చాక్లెట్ పౌడర్ మరింత రుచిని కలిగిస్తుంది. ఇంట్లో వాళ్లంతా టేస్టీ లొట్టలేసుకుంటూ తాగేయచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే, వారికి కూడా ఈ కాఫీ ఇవ్వచ్చు. అదిరిపోయే కొరియా కాఫీ టేస్ట్ చూస్తే ఎవ్వరైనా అదుర్స్ అనాల్సిందే. బనానా, మిల్క్, కోల్డ్ కాఫీ, చాక్లెట్ పౌడర్, సిరప్ కలవడంతో క్రేజీ టేస్టీని కలిగి ఉంటుంది. ఒక్కసారి తాగిన వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఈ అదిరిపోయే కాఫీని ఇప్పుడే ఇంట్లో ట్రై చేయండి.