Fastest Fifty : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. రోజు రోజుకు కొత్త కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వస్తుంటారు. అద్బుతమైన ఫామ్ కనబరుస్తారనుకున్న పాత ఆటగాళ్లు ఫామ్ కోల్పోతున్నారు. మరోవైపు కొత్త ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లోకి వచ్చి రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నమీబియా కి చెందిన ఓ ఆటగాడు ఇలాగే వ్యవహరించడం విశేషం. అంతర్జాతీయ టీ-20ల్లో నమీబియా కి చెందిన జాన్ ఫ్రైలింక్ విధ్వంసమే సృష్టించాడు. ఇవాళ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత నమీబియా బ్యాటింగ్ చేసింది.
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ లో హ్యాండ్ షేక్ వివాదానికి కారణం అతడేనా..?
అయితే ప్రారంభం నుంచే జాన్ ఫ్రైలింక్ రెచ్చిపోయాడు. ముఖ్యంగా తొలి ఓవర్ లో వరుసగా 4, 4, 4.. రెండో ఓవర్ లో 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్ కాస్త గ్యాప్ ఇచ్చి.. నాలుగో ఓవర్ తన విశ్వరూపాన్నే చూపించాడు. ట్రైవర్ గ్వాండ్ వేసినటువంటి ఆ ఓవర్ లో 4,4,6, 6, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. జస్ట్ మిస్.. యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేస్తుండే అని అతని పై చర్చించుకోవడం విశేషం. ఫ్రైలింక్ ధాటికి నమీబియా 4 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సాధించింది. అర్ద సెంచరీ తరువాత కొద్ది సేపు మెరుపులు మెరిపించి.. 31 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి 9వ ఓవర్ లో ఔట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో ప్రైలింగ్ చేసిన హాఫ్ సెంచరీ.. టీ 20 ల్లో నమీబియా తరపున అత్యంత ఫాస్టెస్ట్ గా నమోదైంది. ఓవరాల్ గా చూస్తే.. అంతర్జాతీయ టీ-20ల్లో మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచింది.
ఇప్పటివరకు అంతర్జాతీయ టీ-20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ పేరిట నమోదై ఉంది. 2023 ఆసియా క్రీడల్లో మంగోలియా పై 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు దీపేంద్ర సింగ్ ఏరి. ఆ తరువాత అత్యంత వేగవంతమైన హాప్ సెంచరీ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 వరల్డ్ కప్ లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఏకంగా 6 బంతుల్లో 6 సిక్స్ లు కూడా కొట్టి వరల్డ్ రికార్డు సాధించాడు యువరాజ్ సింగ్. ప్రైలింక్ కంటే ముందు మరో ముగ్గురు కూడా 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. 2019లో ఆస్ట్రియా కి చెందిన మీర్జా ఎహసాన్, 2024లో జింబాబ్వే కి చెందిన మరుమణి, ఇదే ఏడాది టర్కీకి చెందిన మహ్మద్ ఫహద్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. ఇక ప్రైలింగ్ చెలరేగడంతో ఈ మ్యాచ్ లో నమీబియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 204/7 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో నమీబియా నే విజయం సాధించడం విశేషం. ప్రైలింక్ కంటే ముందు నమీబియా తరపున అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు లాప్టీ ఈటన్ పేరిట ఉంది. 18 బంతుల్లో నేపాల్ పై చేశాడు. తాజాగా ప్రైలింక్ బ్రేక్ చేశాడు.