Bank of Maharashtra Recruitment: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 17న ఉద్యోగాల దరఖాస్తుకు గడువు ముగియనుంది.
నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఓ సారి చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 172
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ డిజిటిల్ చానెల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ తప్పుకుండా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పాసై ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 29
దరఖాస్తు కు చివరి తేది: 2025 ఫిబ్రవరి 17 (ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 17 లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి)
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది.
వయస్సు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 22 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మొత్తం 100 మార్కులలో, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 50 మార్కులు, SC/ST/PWBD అభ్యర్థులకు కనీసం 45 మార్కులు రావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bankofmaharashtra.in/
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలకు అప్లై చేసే విధానం:
అధికార వెబ్ సైట్ ను సందర్శించండి. తర్వాత రిక్రూట్ మెంట్ పైన క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్ ను పూర్తిగా నింపాలి. అవసరమున్న డాక్యుమెంట్ల ను అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా దరఖాస్తు రుసుము చెల్లించాలి.ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. మొత్తం 100 మార్కులలో, జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, SC/ST/PWD అభ్యర్థులు కనీసం 45 మార్కులు పొందాల్సి ఉంటుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.