BigTV English

Renu Desai: ఇలాంటి వెధవలతో జాగ్రత్త… రేణు దేశాయ్ ఫైర్

Renu Desai: ఇలాంటి వెధవలతో జాగ్రత్త… రేణు దేశాయ్ ఫైర్

Renu Desai : రన్వీర్ అలహాబాదియా (Ranveer Allahbadia)… సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అతని గురించే చర్చ నడుస్తోంది. రన్వీర్ అలహాబాదియా కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. సమయ్ రైనా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో అభ్యంతరకరమైన, వివాదాస్పద ప్రకటన చేసిన తర్వాత, అతను సోషల్ మీడియాతో సహా ప్రతిచోటా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కొంతమంది సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తుంటే, చాలామంది మాత్రం విరుచుకు పడుతున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఇలాంటి వెధవలకు దూరంగా ఉండాలి అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


రేణూ దేశాయ్ ఫైర్ 

‘ఇండియా గాట్ లేటెంట్’ (India Got Latent) అనే షోలో రన్వీర్ అలహాబాదియా (Ranveer Allahbadia), సమయ్ రైనా (Samay Raina), అపూర్వ ముఖిజ (Apoorva Makhija) చెత్త వాగుడుపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా మొత్తం వారిని ఏకీపారేస్తుంది. రన్వీర్ మాట్లాడిన మాటలైతే సిగ్గుతో సమాజం తలదించుకునేలా ఉండడంతో అతడి అరెస్టుకి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు చేసిన షోను, అందులో మాట్లాడిన మాటలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఆ షోలో ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే షోలో పాల్గొన్న వాళ్లు… వీళ్ళు వేసే వల్గర్ కామెడీ పై రియాక్ట్ అవ్వకుండా నవ్వడం ఆందోళనకరంగా మారింది.


తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అవుతూ రేణూ దేశాయ్ (Renu Desai) మండిపడింది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో వీళ్ళ గురించి ప్రస్తావిస్తూ “ఒకవేళ మీరు గనక మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పెంచాలి అని అనుకుంటే… ఇలాంటి ఇడియట్స్ ని అన్ ఫాలో అవ్వండి. యంగ్ జనరేషన్ బాధ్యతగా ఉండాలి, తప్పితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ వల్గార్టీని యూత్ యాక్సెప్ట్ చేస్తోంది” అంటూ ఆవేదంలో వ్యక్తం చేసింది.

ఇక రణ్వీర్ అలహాబాదియా ప్రస్తుతం తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. అతని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైరల్ అవుతున్న ఆ వీడియోలో రన్వీర్ తప్పు ఎంత ఉందో అందులో పాల్గొన్న అపూర్వ , సమీర్ లది కూడా అంతే తప్పు, కాబట్టి ఈ ముగ్గురిని విడిచి పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్లు.

సమయ్ రైనాకు హీరోయిన్ల సపోర్ట్ 

ఇంతకుముందు రాఖీ సావంత్ సమయ్ రైనా ఈ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొంది. ఇప్పుడు రణ్‌వీర్ బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత, అతన్ని క్షమించాలని పోస్ట్ చేసి తన సపోర్ట్ తెలియజేసింది. అలాగే ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొంతమందిని ఇష్టపడకపోవడం లేదా వారు చెప్పిన విషయాలు మీకు నచ్చకపోవడం వల్ల జైలుకు పంపాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని రాసుకొచ్చింది. ప్యానల్ లో ఉన్న మిగతా వాళ్ళు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఒప్పుకుంటూనే ఆమె ఇలా సమయ్ కు సపోర్ట్ చేయడంపై మండిపడుతున్నారు నెటిజన్లు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×