BEL Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను సవివరంగా చూద్దాం.
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), బెంగళూరు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 26న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజినీర్ కు సంబంధించిన ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 26
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ/బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఈ జాబ్స్ కి దరఖాస్తు పెట్టుకోండి.
వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి 32 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.40,000 నుంచి రూ.55000 జీతం ఉంటుంది.
చిరునామా: అప్లికేషన్ ను ది మేనేజర్, హ్యూమన్ రీసోర్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మిలటరీ రాడార్స్-ఎస్‌బీయూ, జలహళ్ళి పోస్ట్, బెంగళూరు-560013 కు పంపాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/
అర్హత ఉండి ఆసక్తి కల్గిన వారందరూ ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.40వేల నుంచి రూ.55వేల జీతం ఉంటుంది.
Also Read: NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.5లక్షల జీతం.. ఇలా అవకాశం మళ్లీ రాదు భయ్యా..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 26
Also Read: AAI Recruitment: డిగ్రీ అర్హతతో ఏఏఐ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ జాబ్ గిట్ల వస్తే భారీ జీతం..