Arjun Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారు ఉండరు. క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ చేసిన రికార్డులు అలాంటివి. అందుకే అతన్ని మాస్టర్ బ్లాస్టర్ అని కూడా పిలుస్తారు. సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో లెజెండ్ ప్లేయర్. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఎన్నో కొత్త రికార్డులు సాధించాడు. ప్రపంచ క్రికెట్ లో క్రికెట్ గాడ్ గా గుర్తింపు పొందాడు. దీంతో సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్ ప్రపంచంలో అర్జున్ టెండూల్కర్ {Arjun Tendulkar} రికార్డులను చూడాలని క్రికెట్ అభిమానులు ఆశించారు.
తండ్రిలా రాణించాలనుకుంటున్న అర్జున్ టెండూల్కర్:
అర్జున్ టెండూల్కర్ కూడా తన తండ్రి మాదిరిగా క్రికెట్ లో మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతగానో శ్రమిస్తున్నాడు. అయితే డొమెస్టిక్ మాత్రమే కాదు.. ఐపీఎల్ లో కూడా ఇప్పటివరకు అర్జున్ పెద్దగా రాణించలేకపోయాడు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా అర్జున్ టెండూల్కర్ దేశవాళీ టోర్నీలో మెరుపులు మెరిపిస్తూ బీసీసీఐ దృష్టిలో పడుతున్నాడు. తన తండ్రికి తగ్గ స్థాయిలో క్రికెట్ ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
అయితే ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ {Arjun Tendulkar} బ్యాటింగ్ పై కాకుండా ఎక్కువగా బౌలింగ్ పై దృష్టి పెట్టాడు. ఆల్ రౌండర్ గా ముందుకు సాగుతున్నాడు. కానీ అతడి నుండి ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్ లు రాలేదు. అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. కానీ ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు ముంబై ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకోలేదు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు రెండుసార్లు ముంబై ఇతడిని కొనుగోలు చేసింది. కానీ అతడికి పెద్దగా ఆడే అవకాశం దక్కలేదు. అవకాశం దక్కిన సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అయితే ఈ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బౌలింగ్ లో తనని తాను మెరుగుపరుచుకుంటున్నాడు అర్జున్ టెండూల్కర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. మైఖేల్ స్టార్క్ త్వరలో రిటైర్మెంట్ తీసుకుంటాడని.. అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టుకి మంచి బౌలర్ దొరికాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
Also Read: Chahal – Mahvash: లండన్ లో అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్.. భార్యను కాదని ప్రియురాలితో !
ఇక ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. దేశవాళి క్రికెట్ లో ఈ యంగ్ క్రికెటర్ ప్రదర్శన కాస్త మెరుగవుతుంది. గతంలో కొంతమంది క్రీడానిపుణులు కూడా అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ యాక్షన్, లైన్ మరియు లెంత్ పై సూచనలు చేశారు. దీంతో ప్రస్తుతం తన బౌలింగ్ వేగాన్ని పెంచుకోవడానికి, మెరుగైన లైన్ అండ్ లెంత్ లో బంతులను సంధించేందుకు సిద్ధమవుతున్నాడు అర్జున్ టెండూల్కర్.
?utm_source=ig_web_copy_link