OTT Movie : తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే కొన్ని సినిమాలు, కొత్త కాన్సెప్ట్‌తో చూడటానికి ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. ఒక పురుషుడు తన భార్యను కోల్పోయిన తర్వాత అతను ఎదుర్కునే సన్నివేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సరికొత్త కాన్సెప్ట్ నే ఇప్పుడు మన మూవీ సజెషన్ లో చెప్పుకుందాం. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమా స్టోరీ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఇతను ఒక సాధారణ యువకుడు. ఆయన గున్జన్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. వారి వివాహ జీవితం సంతోషకరంగా మొదలవుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, రొటీన్ లైఫ్, మిస్‌కమ్యూనికేషన్ వారిని టెన్షన్‌లో పడేస్తాయి. ఇంతలో అభిషేక్ భార్య గున్జన్ ఒక్కసారిగా అదృశ్యమవుతుంది. ఆయన ఆమెను కోల్పోయినట్లు అనుకుంటాడు. ఇక్కడ నుండి థ్రిల్లర్ ఎలిమెంట్స్ మొదలవుతాయి. అభిషేక్ ఆమె మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె స్నేహితులు, కుటుంబం, మరేమైనా సమస్యలు ఉన్నాయా ? అని విచారిస్తుంటాడు.
అభిషేక్ తన భార్యను వెతకడానికి చేసే చిన్న చిన్న ప్లాన్‌లు, వారి పాస్ట్ ఫ్లాష్‌బ్యాక్‌లు, కామెడీ ట్విస్ట్‌లు వీళ్ళ వివాహ జీవితాన్ని సరదాగా చూపిస్తాయి. కానీ థ్రిల్లర్ భాగంలో అనుమానాలు పెరుగుతాయి. గున్జన్ మిస్సింగ్ వెనుక ఒక సీక్రెట్ ప్లాట్ ఉంటుంది. ఇది వారి ప్రేమకు టెస్ట్ అవుతుంది. ఇక క్లైమాక్స్‌లో అభిషేక్ భార్య మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారు ? అభిషేక్ చర్యల వల్ల ఆమె వెళ్లిపోయిందా ? మరెవరితోనైనా ప్రేమలో పడిందా ? అనేది ఒక ఊహించని ట్విస్ట్‌తో బయటపడుతుంది. అంతే కాకుండా జీవితంలోని చిన్న మిస్టేక్‌లు ఎలా పెద్ద సమస్యలుగా మారతాయో చూపిస్తుంది. ఈ సినిమా ప్రేమ, ట్రస్ట్ ముఖ్యమని ఒక పాజిటివ్ సందేశం ఇస్తూ ముగుస్తుంది.
‘వైఫ్, ఐ’ (Wife, i) 2019లో విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఇది జీ.ఎస్.ఎస్.పి. కల్యాణ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సూర్య అకొండి (ప్రధాన పాత్ర), గున్జన్ అరాస్ (భార్య పాత్ర) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2019 డిసెంబర్ 5 న థియేటర్లలో విడుదలై, 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది.
Read Also : అర్ధరాత్రి దంపతుల రూమ్ లోకి చొరబడి అరాచకం… అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్, థ్రిల్లింగ్ ట్విస్టులన్న మలయాళ మూవీ