E-Paper
Advertisement

OTT Movie : ఈ సబ్ వేలో అడుగు పెడితే చావే… అంతులేని మిస్టరీ… ‘స్క్విడ్ గేమ్’ లాంటి లైఫ్ అండ్ డెత్ గేమ్

OTT Movie : ఈ సబ్ వేలో అడుగు పెడితే చావే… అంతులేని మిస్టరీ… ‘స్క్విడ్ గేమ్’ లాంటి లైఫ్ అండ్ డెత్ గేమ్

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఒక సినిమా సైకలాజికల్ హారర్ ఫ్యాన్స్‌ ని తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జపాన్ లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. హారర్, గేమ్ అడాప్టేషన్ ప్రియులకు ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఒక వ్యక్తి సబ్‌వే పాసేజ్‌ లో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి బయటపడటానికి అతను చేసే ప్రయత్నమే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది ఎగ్జిట్ 8’ అనేది 2025లో విడుదలైన జపాన్ సైకలాజికల్ హారర్ చిత్రం. ఇది గెంకి కవమురా దర్శకత్వంలో 2023 ఇండీ వీడియో గేమ్ “ది ఎగ్జిట్ 8” ఆధారంగా రూపొందింది. ఇందులో కజునారి నినోమియా (ప్రొటాగనిస్ట్), యామాటో కోచి (గైడ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 95 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 మే 19న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మిడ్‌నైట్ స్క్రీనింగ్‌లో ప్రీమియర్ అయి, ఆగస్టు 29 న జపాన్‌లో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

రూసినిమా కాజు అనే ఒక మనిషి జపాన్ లో ఒక అన్డర్‌ గ్రౌండ్ సబ్‌వే పాసేజ్‌ వేలో చిక్కుకుంటాడు. ఇది అంతులేని అనంతమైన లూప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అతని ముందున్న ఒకే ఒక్క దారి ఎగ్జిట్ 8ని కనుగొని, అక్కడి నుంచి బయటపడటం. కానీ ఇందులో ప్రతి మలుపు ఆయన్ని మళ్లీ మొదటి పాయింట్‌కు తిరిగి తీసుకెళ్తుంది. పాసేజ్‌లో ఒక సైన్ బోర్డు రూల్స్ కూడా చూపిస్తుంది. ఈ రూల్స్ ఒక గేమ్ లాగా ఉంటాయి. కానీ ఒక్క చిన్న మిస్టేక్ కూడా ఆయన్ని లూప్‌లోకి తిరిగి పంపుతుంది. కాజుకి మొదట అక్కడ పరిస్థితులు సాధారణంగా కనిపిస్తాయి. కానీ క్రమంగా స్టోరీ ఉత్కంఠతను పెంచుతుంది. ఒక మ్యూజిక్ బాక్స్ రివర్స్‌గా ప్లే అవుతుంది. ఒక పోస్టర్‌లో ముఖాలు మారతాయి, లైట్స్ ఫ్లికర్ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అక్కడినుంచి అతను తప్పించుకుని వెళ్లాలి. లేకపోతె అది మరింత డీప్‌గా వెళ్లి, మరిన్ని హాల్యూసినేషన్స్‌ను తీసుకొస్తుంది.

ఈ సినిమా ప్రతి ఫ్రేమ్‌ లో టెన్షన్ బిల్డ్ చేసి, ప్రేక్షకుడిని కూడా గేమ్‌లోకి ఇన్‌వాల్వ్ చేస్తుంది. ఈ సమయంలో కాజు పాస్ట్ బయటపడుతుంది. ఆయన ఒక రిలేషన్‌షిప్ సమస్యలతో బాధపడుతుంటాడు. పాసేజ్ ఆయన మానసిక ట్రామాను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆయన మెమరీలు, ఇల్యూషన్స్ లాగా మారతాయి. ఒక్క చిన్న మిస్టేక్ కూడా లూప్‌ను రీసెట్ చేస్తుంది. కాజు మానసికంగా బ్రేక్‌డౌన్ అవుతాడు. క్లైమాక్స్‌లో స్టోరీ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. ఇది ఒక ఇన్‌ఫినిట్ ఇల్యూషన్ లాగా మారుతుంది. కాజు చివరికి ఎగ్జిట్ 8 చేరుతాడా ? లూప్‌లో చిక్కుకుంటాడా ? అనేది ఒక మైండ్-బెండింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది.

Read Also : చిన్న క్లూ కూడా వదలకుండా చంపే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న సీట్ ఎడ్జ్ కన్నడ క్రైమ్ కథ

Related News

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

Big Stories

×