BigTV English

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 ఉద్యోగాలు.. జాబ్ వస్తే అక్షరాల రూ.85,000 జీతం

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 ఉద్యోగాలు.. జాబ్ వస్తే అక్షరాల రూ.85,000 జీతం

Bank of Baroda: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు, వెకెన్సీలు, పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


గుజరాత్ రాష్ట్రం, వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ విధానంలో 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 2500


బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

గుజరాత్: 1160 పోస్టులు

కర్నాటక: 450 పోస్టులు

మహారాష్ట్ర: 485 పోస్టులు

మిగిలిన పోస్టులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి.

లోకల్ బ్యాంక్ ఆఫీసర్: 2500 పోస్టులు

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీసం ఏడాది పాటు బ్యాంకింగ్ ఎక్స్ పీరియన్స్ ఉంటే బెటర్. అభ్యర్థులకు రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష వచ్చి ఉండాలి. చదవడం, మాట్లాడడం రాయడం వచ్చి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యత తప్పనిసరి.

వయస్సు: 2025 జులై 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదిహేనేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉండాలి. రూ.48,480 నుంచి రూ.85,920 జీతం ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే?: ఇంగ్లిష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్ నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. .

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 4

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 24

ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్ కతా, అహ్మదాబాద్

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

ALSO READ: ECIL Jobs: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం వెకెన్సీల సంఖ్య:  2500

దరఖాస్తుకు చివరి తేది: జులై 24

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×