IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే కేవలం టోర్నీ మాత్రమే కాదు. ఇది భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఓ క్రికెట్ పండుగ. ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్స్ ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో 17 సీజన్లు జరగగా.. టైటిల్ గెలవలేకపోయిన టీమ్ లలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి) టీమ్ కూడా ఒకటి.
అలాగని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మొత్తానికి ఫెయిల్యూర్ జట్టు కూడా కాదు. ఈ టీమ్ మూడుసార్లు ఫైనల్ చేరింది. అలాగే మరో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. గత ఐదు సీజన్లలో ఆర్సిబి 4 సార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో ఆరో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఆర్సిబి జట్టుకు 9 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. 2021 ఐపిఎల్ సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
2022 ఐపీఎల్ సీజన్ నుండి ఫాఫ్ డూప్లెససిస్ ఈ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో మిగతా ఫ్రాంచైజీలన్నీ ఓఎత్తైతే.. ఆర్సీబీ మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ టీమ్ లోని ఆల్ రౌండర్లు, అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఏ క్షణంలోనైనా మ్యాచ్ ని మలుపు తిప్పే హిట్టర్లు ఉండేవారు. కానీ వారు ఇంతవరకు ఐపీఎల్ లో కప్ కొట్టలేదు. కానీ ప్రతి సీజన్ లో ఆర్సిబి అభిమానులు మాత్రం “ఈ సాలా కప్ నమ్దే”.. అంటే ఈ సంవత్సరం కప్పు మాదే అంటూ హంగామా చేస్తారు.
కానీ దానికి అనుగుణంగా మాత్రం ఆర్సిబి ప్లేయర్స్ ఆట మాత్రం ఉండదు. ఇక 2025 సీజన్ కి సంబంధించి ఆర్సిబి ఎక్కువగా సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకుండా.. యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపింది. భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజిల్ వుడ్ వంటి కీలక ప్లేయర్లను ఆర్ సి బి ఈ సీజన్ లో దక్కించుకుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆర్సిబి.. 2025 మెగా వేలంలోకి 83 కోట్లతో అడుగుపెట్టింది. ఇందులో యువ ఆటగాళ్లకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు రిలీఫ్… తన గాయంపై బుమ్రా కీలక ప్రకటన
అయితే ఈ యంగ్ ప్లేయర్స్ తో ఈసారి ఆర్సిబి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్న మాట. ఈ కప్ కోసం 17 సంవత్సరాలుగా ఆర్సీబీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి ఆర్సిబి ఎలాగైనా కొట్టాలని ఓ తెలుగు వ్యక్తి.. అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తున్నాడు. పాదయాత్రగా శబరిమల వెళుతూ దారి వెంట ఉన్న అన్ని దేవుళ్లకు మొక్కుతూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2025 ఐపీఎల్ లో ఆర్సిబి ఛాంపియన్ అవ్వాలని శబరిమల యాత్ర చేస్తున్నానని చెబుతున్న పటాస్ ప్రశీత్ అనే ఈ ఆర్సిబి డై హార్డ్ ఫ్యాన్ వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">