SBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం, ఎంఎంఎస్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో మీరు కనుక సెలెక్ట్ అయితే మంచి వేతనం లభించనుంది.
రిటైల్ ప్రోడక్స్ట్ విభాగంలో 273 పోస్టులు భర్తీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాల ఉద్యోగాలున్నాయి. మేనేజర్ పోస్టులకు ఈ నెల 21న, ఎఫ్ఎల్‌సీ కౌన్సిలర్/ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 26 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను సవివరింగా చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 273
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో మేనేజర్ పోస్టులు, ఎఫ్ఎల్‌సీ కౌన్సిలర్/ డైరెక్టర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
మేనేజర్: 4 పోస్టులు
ఎఫ్ఎల్‌సీ కౌన్సిలర్: 263 పోస్టులు
ఎఫ్ఎల్‌సీ డైరెక్టర్: 6 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం, ఎంఎంఎస్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: మేనేజర్ పోస్టులకు ఈ నెల 21 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఎఫ్ఎల్‌సీ కౌన్సిలర్/ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 26 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 28 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల అనుభవం, అర్హత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీని ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. మేనేజర్ ఉద్యోగాలకు రూ.85,920 నుంచి రూ. 1,05,280 జీతం ఉంటుంది. ఎఫ్ఎల్ సీ కౌన్సిలర్/ డైరెక్టర్లకు రూ.50,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 273
దరఖాస్తుకు చివరి తేది: మేనేజర్ పోస్టులకు మార్చి 21, ఎఫ్ఎల్‌సీ కౌన్సిలర్/ డైరెక్టర్ పోస్టులకు మార్చి 26 న దరఖాస్తు గడువు ముగియనుంది.
ALSO READ: Exim Bank: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,05,280.. దరఖాస్తు పూర్తి వివరాలివే..
ALSO READ: IOCL Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతతో 200 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా..!