BigTV English

Modi Letter to Sunita: సునీతా తిరుగు ప్రయాణంపై ప్రధాని ఆసక్తి.. వైరల్ అవుతున్న మోదీ లేఖ

Modi Letter to Sunita: సునీతా తిరుగు ప్రయాణంపై ప్రధాని ఆసక్తి.. వైరల్ అవుతున్న మోదీ లేఖ
Advertisement

భారత్ సహా ఇప్పుడు ప్రపంచం అంతా సునీతా విలియమ్స్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తన సహ వ్యోమగామి విల్మోర్ తో కలసి 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్.. ఎట్టకేలకు వ్యోమ నౌక ద్వారా తిరిగి భూమిపైకి వస్తోంది. అయితే ఆ ప్రయాణం సుఖాంతం కావాలని, సునీత సురక్షితంగా భూమిపై అడుగు పెట్టాలని ప్రపంచం ఆకాంక్షిస్తోంది. ఆమె భారత సంతతి మహిళ కావడంతో.. గుజరాత్ లోని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెకోసం ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనలన్నీ ఫలించాలని, ఆమె క్షేమంగా భూమిపైకి రావాలని ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన గతంలోనే సునీతా విలియమ్స్ కి ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఆమెకు చేరవేసే బాధ్యతను వ్యోమగామి మైక్ మాసిమినోకి అప్పగించారు. మోదీ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సునీతా విలియమ్స్ భూమిపైకి బయలుదేరిన సమయంలో ఆ లేఖను సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ ఏడాది మార్చి-1న ప్రధాని సునీతా విలియమ్స్ కి లేఖ రాశారు. 140 కోట్లమంది భారతీయులు సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిపైకి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నట్టు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో వ్యోమగామి మాసిమినోను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య సునీతా విలియమ్స్ ప్రస్తావన వచ్చినట్టు తన లేఖలో పేర్కొన్నారు. ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత తాను ఈ లేఖ రాయకుండా ఉండలేకపోయానని, అందుకే లేఖ రాసి దాన్ని మాసిమినో ద్వారా మీకు పంపిస్తున్నానంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనల్లో గత అధ్యక్షుడు బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని కలిసినప్పుడు కూడా సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై వాకబు చేసినట్టు తెలిపారు. ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఆ అంశాలను కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు.

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందిన వ్యక్తి. ఆమె తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశానికి చెందిన మహిళ. వారిద్దరికీ ముగ్గురు సంతానం. అందులో సునీతా విలియమ్స్ చిన్నవారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన సునీతా.. ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం వ్యోమగామిగా తన కెరీర్ ప్రారంభించారు. ప్రధాని మోదీ తన లేఖలో.. సునీతా తండ్రి దీపక్ పాండ్యాని కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో అమెరికాలో తాను సునీతాతోపాటు ఆమె తండ్రిని కూడా కలిశానని గుర్తు చేసుకున్నారు. అయితే సునీతా తండ్రి ఇప్పుడు లేరు. ఆయన మరణం తర్వాత తల్లి బోనీ పాండ్యా సునీతతో ఉన్నారు. ఆమె రాకకోసం బోనీ పాండ్యా ఎదురు చూస్తుంటారని గుర్తు చేశారు ప్రధాని మోదీ. భారత దేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైన కుమార్తె సునీతా విలియమ్స్ అని అన్నారు. భూమి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నా ఆమె భారతీయుల హృదయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారని గుర్తు చేశారు.

ప్రధాని మోదీ రాసిన లేఖకు గతంలోనే సునీతా స్పందిచారు. ఆయనతోపాటు, భారత దేశానికి కూడా ఆమె కృతజ్ఞతల సందేశం పంపించారు.

Related News

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Big Stories

×