CHSL Jobs: ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్. ప్రభుత్వం ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా.. అయితే ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్ఎస్ఎల్)-2025 నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునల్స్ లో ఉంటాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు, వెకెన్సీలు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, జీతం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్ఎస్ఎల్)-2025 నుంచి 3131 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 18న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3131
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ లో వివిధ రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరిట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
* లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
* డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)
* డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
విద్యార్హత: ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టు కచ్చితంగా ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 23
దరఖాస్తుకు చివరి తేది: జులై 18
టైర్-1 ఎగ్జామ్ డేట్స్: 2025 సెప్టెంబర్ 8 నుంచి 2025 సెప్టెంబర్ 18 వరకు
టైర్-2 ఎగ్జామ్ డేట్స్: ఫిబ్రవరి, మార్చి 2026
వయస్సు: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు 15 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ఎల్‌డీసీ జేఎస్ఏ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63200 జీతం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.29,200 నుంచి రూ.92,300 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
క్వశ్చన్ పేపర్: టైర్-1 పరీక్షకు మొత్తం 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
టైర్-2 పరీక్షకు 405 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.nic.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 3131
దరఖాస్తుకు చివరి తేది: జులై 18
ALSO READ: MIL: ఎమ్ఐఎల్‌లో ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ బ్రో