UCSL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో, ట్రేడులో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్ (యూసీఎస్ఎల్) లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, మాల్పేలోని ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (UCSL)- సీఎస్‌ఎల్.. కాంట్రాక్ట్ విధానంలో పలు సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సూపర్ వైజర్ (మెకానికల్), సూపర్ వైజర్ (ఎలక్ట్రికల్), సూపర్ వైజర్ (పెయింటింగ్), సూపర్ వైజర్ (హెచ్ఎస్ఈ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
సూపర్‌వైజర్ (మెకానికల్)- 10 పోస్టులు
సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)- 05 పోస్టులు
సూపర్‌వైజర్ (పెయింటింగ్)- 02 పోస్టులు
సూపర్‌వైజర్ (హెచ్‌ఎస్‌ఈ)- 01 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 12
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో, ట్రేడులో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా చూస్తారు.
వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 45 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండను. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండను. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండను.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు మొదటి ఏడాది రూ.40,650; రెండో ఏడాది రూ.41,490; మూడో ఏడాది రూ.42,355; నాలుగో ఏడాది రూ.43,246; ఐదో ఏడాది రూ.44,164 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర ఆధారంగ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://udupicsl.com/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 18
దరఖాస్తుకు చివరి తేది: మే 12
Also Read: CSIR-NAL Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.81,000