NPCIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. టెన్త్, ఇంటర్, జీఎన్ఎం, బీఎస్సీ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు సువర్ణవకాశం. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి సమాచారం సవివరంగా చూద్దాం.
కైగా, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)లో 391 సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ: JOBS: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.60,000.. మీరు కూడా అర్హులే..!
మొత్తం ఖాళీల సంఖ్య: 391
న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ బీ, స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్ఆర్), అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ అండ్ ఏ), అసిస్టెంట్ గ్రేడ్-1 (సీఅండ్ ఎంఎం), నర్స్, టెక్నీషియన్/ సీ (ఎక్స్- రే టెక్నీషియన్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీ పోస్టులు..
సైంటిపిక్ అసిస్టెంట్ బీ: 45 పోస్టులు
స్టైఫండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్: 82 పోస్టులు
స్టైఫండర్ ట్రైనీ/ టెక్నీషియన్ (ఎస్టీ/ టెక్నీషియన్) : 226 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ అండ్ ఏ): 4 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (సీ అండ్ ఎమ్ఎమ్): 10
నర్స్- ఏ: 1 పోస్టు
టెక్నీషియన్ /సీ (ఎక్స్- రే టెక్నీషియన్): 1 పోస్టు
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మార్చి 12
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 1
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్, ఇంటర్, జీఎన్ఎం, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, బీఎస్సీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: సైంటిఫిక్ అసిస్టెంట్, ఎస్టీ/ఎస్ఏ, నర్స పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
మిగితా పోస్టులకు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.39 వేల నుంచి రూ.68,000 వరకు వేతనం ఉండనుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://npcil.nic.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 391
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 1