East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని హుకుంపేట వాంబే కాలనీలోని ఓ ఇంట్లో తల్లీ, కూతురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతులను ఏలూరుకు చెందిన ఎండీ సల్మా (38) , సానియా(16)గా గుర్తించారు. కాగా.. వీరిని కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా నిర్ధారించగా, హత్య చేసిన అనంతరం నిందితుడు.. మృతుల ఇంటికి బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయాడు. దాంతో.. వారు ఎక్కడికి వెళ్లారో తెలియక చుట్టుపక్కల వాళ్లు పలకరించేందుకు వచ్చినా.. ఇంటికి తాళం వేసి ఉండడంతో తిరిగి వెళ్లిపోయారు.
వీరి గురించి ఇంటికి వచ్చిన ఓ బంధువు మాత్రం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చి.. ఇంటి తలుపు తట్టగా, ఎవరూ పలకలేదు. అనుమానంతో ఇంటి కిటికీలోంచి లోపలికి పరిశీలించగా.. ఇంట్లో తల్లీ, కూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. దాంతో.. స్థానికులు, చుట్టుపక్కల వాళ్లు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లీకూతుళ్లను హత్య చేయడంతో.. జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ విద్య, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్.. హత్య జరిగిన ఇంటికి చేరుకున్నారు. హత్య జరిగిన విధానంపై పరిశీలన చేసిన పోలీసులు, క్లూస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. కాగా.. ఈ హత్యకు ఏఏ కారణాలు ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వైపు ఈ హత్య కేసుపై పోలీసులు అనేక రకాలుగా దర్యాప్తు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే హంతకుడిని గుర్తించారు. తల్లీ కూతుళ్లను హైదరాబాద్‌కు చెందిన పల్లి శివకుమార్ కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ హత్యకు హంతకుడు శివకుమార్, మృతురాలు సల్మా తో పరిచయమే కారణం అని తెలుస్తోంది. వీరిద్దరు గతంలో ఈవెంట్ కార్యక్రమాల్లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం, స్నేహంగా మారిందని.. అక్కడి నుంచి ఈ హత్యకు దారి తీసిందని వెల్లడించారు.
Also Read : BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లో మృతి..
జంట హత్యలకు పాల్పడిన నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతని అనుసరిస్తుండగా అతని పరారీకి ప్రయత్నించాడు. దీంతో.. అతన్ని వెంబడించి మరీ కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి పట్టుకున్నారు. ఈ ఛేజింగ్ సమయంలో నిందితుడు ముళ్ల కంచెల నుంచి పరుగెత్తడంతో.. ఎస్సైకి గాయాలయ్యాయి. పైగా.. అతను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎస్సై శ్రీహరి ఎడమ కంటికి గాయం అయ్యింది. కాగా.. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. హంతకుడు శివకుమార్, మృతురాలు సల్మాన్ మధ్య గత కొంతకాలంగా పరిచయం ఉందని తేలింది. అయితే.. ఇటీవల మృతురాలు సాల్మా.. మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందని తెలిసి, వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. అదీ కాస్తా హత్యకు దారి తీసిందని చెబుతున్నారు.
Also Read :Meerut murder Case : జైలులో గంజాయి కోసం గొడవ – మీరఠ్ హత్య కేసు నిందితుల విచిత్ర ప్రవర్తన