AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి(AIIMS MANGALAGIRI) కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మంగళగిరి, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి(AIIMS MANGALAGIRI) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1 న ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో కౌన్సిలర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..
కౌన్సిలర్: 01 పోస్టు
ప్రాజెక్టు అసిస్టెంట్: 01 పోస్టు
ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్: 02 పోస్టులు
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 1
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1 న నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు కౌన్సిలర్, ప్రాజెక్టు్ అసిస్టెంట్‌కు రూ. 23,515, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.26,500 వేతనం ఉంటుంది.
విద్యార్హత: ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ణయించారు. కౌన్సిలర్, ప్రాజెక్టు్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్‌కు 40-45 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు కౌన్సిలర్, ప్రాజెక్టు్ అసిస్టెంట్‌కు రూ. 23,515, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.26,500 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఏప్రిల్ 1 న నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 1
ALSO READ: TGPSC-TG High Court: గ్రూప్-1 పేపర్లను మళ్లీ దిద్దాలి.. హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్