Icecream Side effects: వేసవి కాలం వచ్చేయడంతో ఎక్కడ చూసినా ఐస్ క్రీంలు, జ్యూస్‌లు, కొబ్బరికాయలు, మిల్క్ షేక్‌లు కనిపిస్తున్నాయి. వాతావరణం బాగా వేడిగా ఉంది కదా అని చాలా మంది ఎక్కువగా కూల్‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. కానీ, ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ ఐస్ క్రీంలు తింటే శరీరంపై చాలా చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. వేసవిలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు చూద్దాం..
ఐస్ క్రీంలో షుగర్, ఫ్యాట్స్, కేలరీలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా ఐస్ క్రీం తింటే, శరీరంలో షుగర్ స్థాయిలు పెరిగి, ఇన్సులిన్ రిసిస్టెన్స్, డయాబెటిస్‌కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు ఐస్ క్రీంను తినడం వల్ల శరీరం డీహైడ్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల ముక్కు, గొంతు లేదా పేగుల్లో సమస్యలు రావచ్చని అంటున్నారు. వీటి వల్ల వాంతులు, అసౌకర్యం, కడపులో నొప్పి వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఐస్ క్రీంలో వాడే ఆర్టిఫిషియల్ షుగర్స్, ఇతర పదార్థాలు పంటికి హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సెన్సివిటీ వచ్చే అవకాశం ఉందట. మరికొందరిలో ఐస్ క్రీం కారణంగా క్యావిటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు ఐస్ క్రీం తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
చల్లని ఐస్ క్రీమ్ తినడం వల్ల మన శరీరం లోపల అనేక రకాల భాగాలపై ప్రభావం పడుతుందట. కొన్ని సందర్భాలలో, బరువు పెరుగుదల, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: కీర దోసకాయ తినకుంటే ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతారో తెలుసా?
వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత సహజంగానే పెరుగుతుంది. అప్పుడు చల్లగా ఉండే ఐస్ క్రీంను తినడం వల్ల, శరీరంలో వేడి – చల్లని పరస్పర ప్రభావం వల్ల విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని డాక్టర్లు చెబుతన్నారు. వీటి వల్ల కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటివి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజూ ఐస్ క్రీం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే, క్రమంగా ఈ అలవాటును మార్చుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఐస్ క్రీంకు బదులుగా ఫ్రూట్ సలాడ్స్, పండ్ల జ్యూస్‌ల వంటి వాటిని తరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు కూడా అందుతాయని అంటున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.