BigTV English

Professor Jobs: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌‌లో 40 ప్రొఫెసర్ ఉద్యోగాలు..

Professor Jobs: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌‌లో 40 ప్రొఫెసర్ ఉద్యోగాలు..

Professor Jobs: పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది మంచి అవకాశం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌(UOHYD)లొ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20తో దరఖాస్తు గడువు ముగియనుంది.


నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOHYD)లో ప్రొఫెసర్, అసోసియేట్  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40


ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్నాయి.

వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

మ్యాథ్స్‌, కంప్యూటర్ అండ్ ఇన్‌న్ఫర్మేషన్ సైన్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్‌, ఎనిమల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, న్యూరల్ కగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లయిడ్‌ లింజిస్టిక్స్ అండ్‌ ట్రాన్స్ లేషన్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌, కమ్యూనికేషన్స్, డాన్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌లో పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థికి 65 ఏళ్ల వయస్సు మించి ఉండరాదు.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది.  నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 – రూ. 2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 – రూ. 2, 17, 100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ. 57,700 – రూ.1,82,400 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 20

నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా అదనపు సమాచారం కావాలంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://uohyd.ac.in/teaching-guest-faculty/

Also Read: Meerpet Murder: గురుమూర్తి భార్యను క్రూరంగా చంపాడు.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ

పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌ ఉత్తీర్ణత సాధించినవారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారు తప్పకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం వస్తే మంచి వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగంలో భారీగా జీతాలున్నాయి. నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 – రూ. 2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 – రూ. 2, 17, 100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ. 57,700 – రూ.1,82,400 వేతనం ఉంటుంది. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×