Fact Check: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొంత మంది ఆకతాయిలు రైల్లో బెర్తులకు నిప్పు పెట్టడం ఆ వీడియోల్లో కనిపిస్తుంది. న్యూస్ పేపర్ ను కాల్చి, రైలు బెర్తులను తగలబెడతారు. ఈ వీడియో ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో చాలా పాతది. 2022లో జరిగింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు ఇప్పటికే జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ వీడియో 2002 జూన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దగ్గర ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన అప్పట్లో హింసాత్మకంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లారు. ప్లాట్ ఫారమ్ మీద ఉన్న రైళ్ల మీద రాళ్లు విసిరారు. స్టేషన్ లోని ప్రయాణీకులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది రైలు పట్టాల మధ్యలో నిప్పు పెట్టారు. మరికొంత మంది రైల్లోకి చొరబడి బెర్తులకు నిప్పంటించారు.
Yes, this is old video of June 2022.
Old post link: https://t.co/ZDE6DslcM9 pic.twitter.com/F1wSxCfojm— Finest Observer (@finestobserver) January 27, 2025
ఆర్మీ రిక్రూట్ మెంట్ కోచింగ్ సెంటర్ల కుట్ర
ఈ విధ్వంసం వెనుక కొన్ని ఆర్మీ రిక్రూట్ మెంట్ కు చెందిన కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని అప్పట్లో రైల్వే పోలీసులు ప్రకటించారు. అంతేకాదు, ఆర్మీ కోచింగ్ సెంటర్లకు చెందిన కీలక సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి అప్పట్లో 100 మందికిపైగా ఆర్మీ అభ్యర్థులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయిన ఏపీకి చెందిన సుబ్బారావు, తెలంగాణకు చెందిన మధుసూధన్ అనే వ్యక్తులపై హత్యాయత్నం, అల్లర్లుకు సంబంధించి సెక్షన్లు అయిన 307, 147 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ రైల్వే పోలీసులు భద్రత పెంచారు. కొద్ది రోజుల పాటు టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే లోపలికి అనుమతించారు.
ఆర్మీ అభ్యర్థుల ఆందోళన ఎందుకంటే?
2022, మే 29న సైనిక దళాల నియామకాల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించేందుకు అగ్నిపథ్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అగ్నిపథ్ లో చేరిన వాళ్లు 4 ఏండ్ల పాటు ఆర్మీకి సేవలు అందించే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లు సర్వీసు కంప్లీట్ అయ్యాక.. వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ డబ్బును సాయుధ దళాలను ఆధునికీకరించేందుకు ఉపయోగించనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.
Read Also: దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏక బిగిన ఎన్ని కిలో మీటర్లు నడుస్తాయంటే?