Brahmanandamతెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘హాస్యబ్రహ్మ’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు బ్రహ్మానందం(Brahmanandam). దాదాపు 1200కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి, గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇకపోతే అప్పుడెప్పుడో తన పెద్ద కొడుకు గౌతమ్ రాజా (Gautam Raja ) హీరోగా నటించిన ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించగా.. ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటించడం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ అందించారని చెప్పవచ్చు. తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ రాజా తాజాగా తాత మనవడు క్యారెక్టర్ లో ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఘనంగా బ్రహ్మ ఆనందం సక్సెస్ మీట్..
స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ లో రాహుల్ యాదవ్ (Rahul Yadav) నిర్మించిన ఈ సినిమాకి ఆర్.వి.ఎస్.నిఖిల్(R.V.S.Nikhil) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్ (Vennela kishore) బ్రహ్మానందం, గౌతమ్ రాజా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. పల్లకిలో పెళ్లికూతురు సినిమా తర్వాత సరైన హిట్స్ లేక ఇండస్ట్రీకి దూరమై.. వ్యాపారాలు చేసుకుంటూ సెటిల్ అయిన గౌతమ్ రాజా.. ఇప్పుడు ఎలాగైనా సరే ఇండస్ట్రీలో గట్టిగా నిలబడాలని తండ్రి బ్రహ్మానందం సహాయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో భాగంగానే ఈ సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఇక సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే బ్రహ్మానందం మాట్లాడుతూ.. తన కొడుకుల కెరియర్ విషయంలో పట్టించుకోకపోవడం తన తప్పే అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి బ్రహ్మానందం ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం.
నా కొడుకుల కెరియర్ విషయంలో నేను తప్పు చేశా – బ్రహ్మానందం
‘బ్రహ్మ ఆనందం’ సక్సెస్ మీట్ లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ..” నేను మామూలుగా బొమ్మలు గీస్తాను. కానీ నా కొడుకు గౌతమ్ రాజా మంచి పెయింటర్. అంతేకాదు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ఇన్స్టాలో ఈయన పెట్టే ఫోటోలు చూసిన వారికి ఈ విషయం బాగా తెలుసు. అయ్యో పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే.. ? అందులో కొంత నా తప్పు కూడా ఉంది. నన్ను చూడండి..నన్ను చూడండి.. అని చెప్పుకోవడం తప్పు నాన్న.. ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలే తప్పా.. మనం చేసే పనులను బట్టి మంచితనం వస్తుంది.. కానీ మంచోడిని అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు తెలిసిపోతూ ఉంటాయి రా.. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్పాను. అయితే వాళ్లు కూడా నేను చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు. ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు. ఆయన న్యూయార్కులో డైరెక్షన్ కోర్స్ కూడా నేర్చుకొని వచ్చాడు. ఎవరైనా నువ్వు ఎవరు అని అడిగితే ఫలానా బ్రహ్మానందం గారి అబ్బాయిని అని చెప్పమన్నా సరే చెప్పడు. వాళ్ళు నన్ను కామన్ మ్యాన్ గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేసినట్లుగా నన్ను ట్రీట్ చేస్తే నాకు నచ్చదు అని నా చిన్న కొడుకు చెప్తాడు. ఆ గొప్పతనాన్ని నేను నా ఖాతాలో వేసుకోవడం కంటే, వాళ్లు అలా పెరిగారు. ఇవాల్టి వరకు మనం చెప్పింది విన్నారు.. దేవుడి దయతో వాళ్లు మంచి మార్గంలోనే నడుస్తున్నారు. ఇక అదే నేను నమ్ముతున్నాను” అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బ్రహ్మానందం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక గొప్ప తండ్రి ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారని, ఆయనకు పుట్టిన కొడుకులు అలాగే గొప్పగా ఆలోచిస్తారని కూడా తండ్రీ కొడుకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.