BigTV English

AP Govt: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోడికి రూ.140.. ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

AP Govt: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోడికి రూ.140.. ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

AP Govt: బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. రోజురోజుకూ కోళ్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. బర్డ్ ఫ్లూ వైరస్ పుణ్యమా అంటూ పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి. అందుకే ప్రభుత్వం వీరిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ధ్రువీకరించారు.


ఏపీలోని ఏలూరు జిళ్లలో ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. జిల్లాలోని ఏ పౌల్ట్రీ ఫారం వద్ద చూసినా, కోళ్ల కళేబరాలే కనిపించే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏలూరు జిల్లాలోని ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఏలూరు కలెక్టర్ ఖండించారు. అయితే ఒక్కసారిగా ఏపీలోని అన్ని జిల్లాల్లో చికెన్ ధరలు అమాంతం తగ్గాయి. ధరలు తగ్గినా చికెన్ కొనుగోలుకు ప్రజలు సాహసించని పరిస్థితి. కొన్ని జిల్లాలలో అధికారులే అధికారిక ప్రకటనలు చేశారు. కొద్దిరోజులు చికెన్, గుడ్డుకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే వసతి గృహాల్లోని విద్యార్థులకు కూడా చికెన్ మెనూలో నుండి తీసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాగా ఏపీలోని ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీనితో తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఈ రైతుల డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత పౌల్ట్రీ రైతుల్ని ఆదుకుంటామని, కోడికి 140 రూపాయలు ఇచ్చేందుకు ప్రతిపాదన ఉందంటూ కలెక్టర్ ప్రకటించారు. పౌల్ట్రీ రైతులకు ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోగా, వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడంపై పౌల్ట్రీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


80,000 కోళ్ల ఖననం..
ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావిత పౌల్ట్రీ లలో గల 80,000 కోళ్లను ఖననం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక చికెన్ తినడంపై కలెక్టర్ మాట్లాడుతూ.. బాగా ఉడికించిన కోడి మాంసం, కోడిగుడ్లు తినవచ్చన్నారు. పౌల్ట్రీ లో పనిచేసే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని, బాదంపూడి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read: వంశీతో జగన్ ములాఖత్? నెక్స్ట్ ప్లాన్ అదేనా?

బర్డ్ ఫ్లూ గుర్తించిన పౌల్ట్రీల మూసివేత
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో బర్డ్ ఫ్లూ సోకిన పౌల్డ్రి ని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మురళి కృష్ణ పరిశీలించారు. బర్డ్ ఫ్లూ రావడానికి పౌల్ట్రీ పరిసరాల్లో అపరిశుభ్రత కారణమని జెడి అన్నారు. ఏపిలోని నాలుగు జిల్లాలో మాత్రమే బర్డ్ ఫ్లూ ప్రభావం ఉన్నట్లు గుర్తించామని, బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీ లో కోళ్లు, కోడిగుడ్ల ను ఖననం చేసి శానిటేషన్ చేశామని తెలిపారు. బర్డ్ ఫ్లూ ఉన్న పౌల్ట్రీ కి ఒక కిలోమీటర్ వరకు నిషేధిత ప్రాంతం గా ప్రకటించామని, ఆ పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దన్నారు. వైరస్ ప్రభావం లేని ప్రాంతాలలో చికెన్, గుడ్డు తినవచ్చని జెడి సూచించారు. సోషల్ మీడియా లో బర్డ్ ఫ్లూ పై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయొద్దని మీడియాను జెడి కోరారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×