Andy Roberts on BCCI: ప్రపంచ క్రికెట్ ని శాసిస్తున్న భారత జట్టు మరో చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ లో మినీ విశ్వకప్ గా ప్రఖ్యాతిగాంచిన ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టును ఓడించి మూడవసారి ఛాంపియన్స్ ట్రోపీని దక్కించుకుంది. టి-20 ఫార్మాట్ లో ప్రపంచ కప్ ని గెలిచి ఏడాది కూడా తిరగకముందే మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ లో విజేతగా నిలిచి భారత జట్టు అద్భుతం చేసింది.
Also Read: Gautam Gambhir: రిలాక్స్ లేదు… ఇంగ్లండ్ భరతం పట్టేందుకు గంభీర్ సంచలన నిర్ణయం !
పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో టీమిండియా తటస్థ వేదిక అయిన దుబాయిలో తన మ్యాచ్లను ఆడింది. ఈ టోర్నీలో అపజేయమన్నది ఎరగకుండా దూసుకుపోయింది. క్రీడాభిమానులు గర్వించేలా పోటీపటిమను ప్రదర్శించింది. ఈ టోర్నీ ఆరంభంలో మొదట బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి, అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది.
ఆ తర్వాత న్యూజిలాండ్ పై ఆధిపత్యాన్ని చెలాయించి గ్రూప్ దశ పోరాటాన్ని ముగించి, ఆస్ట్రేలియా పై సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ కి దూసుకు వచ్చింది. ఫైనల్ లో కూడా అదే జోరుని కొనసాగిస్తూ న్యూజిలాండ్ పై మరోసారి విజయం సాధించి కప్ గెలుచుకుంది. అయితే భద్రతా కారణాల దృశ్య భారత జట్టు పాకిస్తాన్ కి వెళ్లకుండా.. తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడడంపై మొదటినుండి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. భారత జట్టు ఎట్టు కదలకుండా ఒకే చోట మ్యాచ్ లు అన్నీ ఆడేస్తోందని, ఇతర జట్ల మాదిరిగా పలు వేదికలలో ఆడేందుకు ప్రయాణం చేయడం లేదని, ఒకే మైదానంలో ఆడడం వల్ల భారత జట్టుకు లబ్ధి చేకూరుతుందని టీమిండియా పై విమర్శలు చేశారు.
తాజాగా వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ కూడా ఈ తరహా విమర్శలే చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ} పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ కి అనుకూలమయ్యే విధంగా ఐసీసీ నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కి సంబంధించిన మ్యాచ్ లు అన్నీ ఒకే వేదికపై నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. గత టి-20 వరల్డ్ కప్ లోను భారత జట్టుకి ఫీవర్ గా ఐసీసీ నడుచుకుందని అన్నాడు ఆండీ రాబర్ట్స్.
Also Read: Shahid Afridi: ICUలో పాకిస్తాన్ క్రికెట్.. ఆపరేషన్ చేసినా చావడం ఖాయం !
సెమీస్ వెన్యూ వారికి ముందే తెలిసిందని ఆరోపించాడు. తన దృష్టిలో ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అంటూ వ్యంగాస్త్రాలు సంధించాడు. ఒకవేళ క్రికెట్ లో నో బాల్స్, వైడ్స్ ఉండకూడదని ఇండియా కోరితే.. ఐసీసీ ఆ నిబంధనలను కూడా తీసుకువస్తుందని విమర్శించాడు. ఐసీసీ కొన్నిసార్లు భారతదేశానికి నో చెప్పాలని అన్నాడు. తన దృష్టిలో ఐసీసీ పూర్తిగా భారత క్రికెట్ బోర్డు కు అండగా నిలుస్తుందని పేర్కొన్నాడు. దీంతో ఈ వెస్టిండీస్ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలపై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు.