BANK OF BARODA: బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. తె నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, తదితర ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BANK OF BARODA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 6వ తేదీ నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 417
బ్యాంక్ ఆఫ్ బరోడా (BANK OF BARODA ) లో మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. సేల్స్, అగ్రి మార్కెటింగ్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు..
మేనేజర్ (సేల్స్): 227 పోస్టులు
అగ్రి మార్కెటింగ్ ఆఫీసర్: 142 పోస్టులు
అగ్రి మార్కెటింగ్ మేనేజర్: 48 పోస్టులు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 6
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 26
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్దారించారు. మేనేజర్ పోస్టులకు 24 ఏళ్ల నుంచి 34 ఏళ్లు, ఆఫీసర్‌కు 24 నుంచి 36 ఏళ్లు, అగ్రి మార్కెటింగ్ మేనేజర్‌కు 26 నుంచి 42 ఏళ్ల వయస్సు ఉంటుంది.
జీతం: నెలకు మేనేజర్‌కు రూ.64,820 – రూ.93,960 జీతం ఉంటుంది. ఆఫీసర్‌కు రూ.48,480 – రూ.85,920 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in
ALSO READ: Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం