BEML LIMITED: ప్రభుత్వం ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ ఇది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.1,60,000 వరకు జీతం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్: దరఖాస్తుకు 3 రోజులే గడువు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML LIMITED) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 440 ఆపరేటర్ (నాన్ ఎగ్జక్యూటివ్) పోస్టుల భర్తీకి గానూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 440
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లో ఆపరేటర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ టర్నర్, ఐటీఐ వెల్డర్, ఐటీఐ మెషినిస్ట్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
విభాగాల వారీగా వెకెన్సీలు చూసినట్టయితే…
ఐటీఐ ఫిట్టర్: 189 పోస్టులు
ఐటీఐ టర్నర్: 95 పోస్టులు
ఐటీఐ వెల్డర్: 91 పోస్టులు
ఐటీఐ మెషినిస్ట్: 52 పోస్టులు
ఐటీఐ ఎలక్ట్రీషియన్: 13 పోస్టులు
విద్యార్హత: టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 5
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 29 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు ఆఫీసర్ అసిస్టెంట్‌కు రూ.40,000- రూ.1,40,000 జీతం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో..
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bemlindia.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు ఆఫీసర్ అసిస్టెంట్‌కు రూ.40,000- రూ.1,40,000 జీతం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: JOBS: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. భారీ వేతనం.. 2 రోజులే గడువు
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 440
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 5