Intelligence Bureau: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూ్స్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. పది పాసైన వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంటెలిజెన్ బ్యూరో నుంచి 4987 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఆగస్ట్ 17న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4987
ఇంటెలిజెన్స్ బ్యూరో లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.. లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.650 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు రూ.550 ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 26
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్ట్ 17
ఆన్ లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేది: ఆగస్ట్ 19
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి రూ.21,700 నుంచి 69,100 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఎగ్జామ్ నిర్వహించి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను గమనించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.mha.gov.in/en
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. రూ.21,700 నుంచి 69,100 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4987
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 17
ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,10,000 వేతనం