SRH VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team ) మరో ఓటమి చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా… తేలిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్…. వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో.. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ విధించిన లక్ష్యాన్ని 16 ఓవర్లలో మూడు వికెట్ నష్టపోయి ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ తరుణంలోనే ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఈ టోర్నమెంట్లో రెండో విక్టరీ నమోదు చేసుకుంది.
Also Read: SRH VS DC: బ్యాటింగ్ చేయనున్న SRH…ఇవాళైనా 300 కొడతారా..ఆ టీం గెలవడం పక్కానా ?
ఇది ఇలా ఉండగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు…. భారీ స్కోర్ చేస్తుందనుకుంటే… 150 పరుగులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad team ) జట్టు… 18.4 ఓవర్లలోనే… 163 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. టాప్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో అతి తక్కువ పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad team ). అయితే.. ఈ మ్యాచ్లో అనికేత్ వర్మ ( Aniket Verma ) ఒక్కడి దుమ్ము లేపాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. 180 స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించాడు అనికేత్ వర్మ ( Aniket Verma ). అలాగే డేంజర్ ఆటగాడు హెడ్ 12 బంతుల్లో 22 పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. కానీ భారీ స్కోర్ చేయాలని మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో… కేఎల్ రాహుల్ కు ఖ్యాతి ఇచ్చే అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో నాలుగు బౌండరీలతో రెచ్చిపోయాడు హెడ్.
Also Read: IPL 2025: మనల్ని ఎవర్రా ఆపేది… పాయింట్స్ టేబుల్ లో RCB నెంబర్ వన్ ?
దుమ్ములేపిన ఢిల్లీ ఓపెనర్స్
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. ప్రెజర్ ( Jake Fraser-McGurk ) 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. అలాగే మరో ఓపెనర్ డూప్లిసిస్ ( Faf du Plessis )… 27 బంతులలో 50 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. 185 స్ట్రైక్ రేటు తో రఫ్ఫాడించాడు. ఆర్సిబిని వదిలిన తర్వాత అద్భుతంగా ఆడుతున్నాడు డూప్లిసిస్ ( Faf du Plessis ). ఇక అభిషేక్ పోరేల్ 34 పరుగులు చేశాడు. స్టబ్స్ 21 పరుగులు. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Captitals Team) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.